శ్రీ మహా విష్ణువుకు ఇష్టమైన రాశులేంటో తెలుసా?
శ్రీ మహా విష్ణువుకు ఇష్టమైన రాశులేంటో తెలుసుకుందాం. శ్రీ విష్ణువుకు కర్కాటకం, కన్యారాశి, వృషభ రాశులంటే ప్రీతికరం. కర్కాటక రాశి: ఈ రాశి, పునర్వసు నక్షత్రంలో పుట్టినవారైతే శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరం. ఈ రాశికి చంద్రుడు అధిపతి కావడంతో ఈ రాశిలో పుట్టిన వారు చురుకుగా పనులను పూర్తి చేస్తారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చేయగలిగేవారు. నాయకత్వ పదవికి అర్హులు. సహనం కలవారు. ఇతరులకు వీరు సాయం చేస్తారు. ఈ రాశి వారు శ్రీ విష్ణువును పూజిస్తే సర్వశుభాలు చేకూరుతాయి.
వృషభం: మహాభారతంలో శ్రీకృష్ణుడు వృషభ రాశి, రోహిణి నక్షత్రంలో పుట్టినట్లు చెప్తారు. కాబట్టి, వృషభ రాశి వారికి శ్రీకృష్ణుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. సాధారణంగా వృషభ రాశివారు ఇతరులను ఆకట్టుకునే ఆకారాన్ని కలిగివుంటారు. వాక్చాతుర్యతను కలిగి వుంటారు. వక్తలుగా రాణిస్తారు. ఏ రంగంలోనైనా రాణించే సత్తాను, నైపుణ్యతను కలిగివుంటారు.
కన్యారాశి: శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు కన్యా రాశిలో జన్మించారు. కాబట్టి, కన్యారాశిలో జన్మించిన వారికి శ్రీ పురుషుడైన శ్రీ విష్ణువు లక్షణాలను కలిగివుంటారు. అనేక రంగాల్లో రాణిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.