గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (19:13 IST)

30-10-2023 బుధ దశతో కోటి లాభాలు.. భద్ర యోగం.. ఈ రాశులకు అదృష్టం

Astrology
బుధ దశతో కోటి లాభాలు వస్తాయని చెబుతారు జ్యోతిష్యులు. ఆ విధంగా సింహరాశిలో ప్రస్తుతం ఆధిపత్యం వహిస్తున్న బుధుడు అక్టోబరు 1వ తేదీ నుంచి తన రాశి గృహంగా భావించే కన్యారాశిలోకి పరివర్తనం చెందుతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి భద్ర యోగం తగలనుంది. 
 
బుధుడు జ్ఞానానికి అధిపతి. బుధుడు తన అధికార గృహమైన కన్యారాశిలో ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల కొందరికి భద్రయోగం కలుగుతుంది. ఈ భద్ర యోగం వల్ల మేధస్సు పెరుగుతుంది.
 
వృషభం: బుధుడు అధిష్టానం వల్ల వాక్చాతుర్యం పెరుగుతుంది. రావాల్సిన చోట ధనం లభిస్తుంది. చాకచక్యంగా మాట్లాడి అన్నీ కార్యాల్లో విజయం సాధిస్తారు.
 
సింహం: బుధుడు మాటలో చాకచక్యాన్ని, మాధుర్యాన్ని ఇస్తాడు. భూములను కొనుగోలు చేస్తారు. బుధవారం పచ్చని ఆకుకూరలను, పండ్లను దానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. 
 
కన్య: బుధ భగవానుడి సొంత రాశి కన్య. బుధుడు కన్యారాశిలో అధిష్టించడం వల్ల భద్రయోగం పొంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను ప్రసాదిస్తాడు. ఉద్యోగంలో పదోన్నతులు, జీతాలు పెరుగుతాయి.
 
వృశ్చికం: మీ రాశిలోని 11వ ఇంటిని బుధుడు పరిపాలిస్తున్నందున సంతానం కలిగే విషయంలో జాప్యం ఏర్పడవచ్చు. వైద్యుల సలహా మేరకు తగిన చర్యలు తీసుకోవాలి. ఆస్తుల సేకరణ కచ్చితంగా జరుగుతుంది. 
 
కుంభం: కుంభరాశిలో 8వ స్థానంలో బుధుడు సంచరిస్తాడు. దీనివల్ల రాజయోగం కలుగుతుంది. కార్యాలయంలో జీతాల పెరుగుదల, ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. భూమిపై పెట్టుబడి పెట్టే సమయం. 
 
కర్కాటక రాశికి రాహు - కేతు సంచారం వలన వారి జీవితాలలో మార్పులను చూడవచ్చు. అంటే రాహువు మేషరాశి నుండి మీనరాశికి, కేతువు తులారాశి నుండి కన్యారాశికి సంచరిస్తాడు. ఇది సరిగ్గా 30-10-2023న జరుగుతుంది.