బుధవారం, 29 నవంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (19:28 IST)

కేతువుతో చేతులు కలుపుతున్న రాహు.. కన్యారాశి, ధనస్సు?

జ్యోతిష్యం ప్రకారం రాహు-కేతువుల పరివర్తనం జరుగనుంది. ఈ రాహు-కేతువుల కలయిక కారణంగా 12 రాశుల్లో కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. రాహు కేతువు యొక్క ప్రయాణమైనది నవగ్రహాలలో చాలా ముఖ్యమైనదిగా భావించబడుతుంది. 
 
ఎప్పుడూ కలిసిన ప్రయాణం చేసే ఈ గ్రహాలు వెనుకకు వక్రస్థితిలోనే తమ ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. ఇది అక్టోబరులో జరుగనుంది. కేతు గ్రహం ప్రస్తుతం తులారాశిలో సంచారం చేస్తున్నాడు. వచ్చే అక్టోబర్ మూడవ తేదీ నుంచి రాహు గ్రహంతో కలుస్తాడు. నవంబర్ 16వ తేదీ వరకు ఈ సంచారం వుంటుంది. ఇలా రాహు-కేతు గ్రహాల కలయిక కారణంగా అదృష్టాన్ని పొందే రాశులు ఏంటో చూద్దాం. 
 
కన్యారాశి
మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. నిధుల సంబంధిత విషయాలలో పురోగతి ఉంటుంది. అనుకున్న కార్యాల్లో విజయం సాధిస్తాయి. సంపదకు ఏమాత్రం లోటుండదు. డబ్బుకి ఇబ్బంది వుండదు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం చేకూరుతుంది. 
 
సింహరాశి 
మన ధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏర్పడిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. పెట్టుబడులు మంచి విజయాన్ని అందిస్తాయి. వ్యాపారంలో మంచి లాభం లభిస్తుంది. వృత్తి సంబంధిత విషయాలలో కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. 
 
ధనుస్సు 
రాహు-కేతు కలయిక, వక్రస్థితి కారణంగా ధనస్సుకు మేలే జరుగుతుంది. కొత్త పెట్టుబడులు విజయాన్ని అందిస్తాయి. అనుకున్న కార్యాలు జరుగుతాయి. డబ్బు సంబంధిత విషయాలలో పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికతపై  ఆసక్తి పెరుగుతుంది. కోర్టు కేసులు తొలగిపోతాయి.