శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Modified: శనివారం, 30 జనవరి 2021 (22:27 IST)

31-01-2021 నుంచి 06-02-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ధనలాభం వుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది వుండదు. బంధుమిత్రులు మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆది, గురు వారాల్లో సందేశాలు, ప్రకటనలు నమ్మవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలు దీటుగా ఎదుర్కొంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదవీయోగం. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కృషి ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడుతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులుంటాయి. ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. శుక్ర, శని వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహ్వానం అందుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యానుకూలత అంతంతమాత్రమే. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. మనోధైర్యంతో వ్యవహరించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. అనుకోని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సోమ, మంగళ వారాల్లో పనులు సాగవు. ప్రముఖుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. దంపతుల మధ్య అవగాహనలోపం. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సన్నిహితుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు కొత్త అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం బాగున్నా సంతృప్తి వుండదు. ఏదో సాధించలేకపోయామన్న వెలితి వెన్నాడుతుంది. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు కష్టకాలం. చేతివృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ వారం ఆశాజనకం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. ఆపన్నులకు సాయం అందిస్తారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదామార్పు. స్టాక్ మార్గెట్ పుంజుకుంటుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆది, సోమ వారాలలో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. నగదు, పత్రాలు జాగ్రత్త. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. మంగళ, బుధ వారాల్లో అప్రత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఇరువర్గాలకు ఆమోదయోగ్యమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆహ్వానం అందుకుంటారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆశాజనకం. దైవకార్యంలో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. గురు, శుక్ర వారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారుల తీరును గమనించి మెలగండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. క్రీడా, కళాకారులకు ప్రోత్సహకరం.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసిద్ధి, ధనయోగం వున్నాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు సంతృప్తికరం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. శుభకార్యం సానుకూలమవుతుంది. గృహం సందడిగా వుంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. పెట్టుబడులు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. ప్రయాణం విరమించుకుంటారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అప్రమత్తంగా వుండాలి. భేషజాలకు పోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. మీ గౌరవానికి భంగం కలిగే ఆస్కారం వుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. సోమ, మంగళ వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సన్నిహితుల హితవు మీపై సత్ర్పభావం చూపుతుంది. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. జూదాలు, బెట్టింగులకు పోవద్దు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. సాయం చేసేందుకు అయినవారే సందేహిస్తారు. అవసరాలు నెరవేరవు. ఆలోచనలతో సతమతమవుతారు. పనులలో చికాకులు అధికం. సంతానం భవిష్యత్తు ఆందోళన కలిగిస్తుంది. ఏ అవకాశం కలిసిరాక నిస్తేజానికి లోనవుతారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. బుధ, గురు వారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. రుణాలు మంజూరవుతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. శుక్ర, శనివారాల్లో పనులు సాగవు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేదారినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అవివాహితులకు శుభయోగం. పరిచయాలు విస్తరిస్తాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహం కలిగిస్తుంది. నిరుద్యోగలకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. న్యాయ, ఆరోగ్య, చేతివృత్తుల వారికి ఆశాజనకం.