మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-01-2021- మంగళవారం మీ రాశి ఫలితాలు-కుబేరుడిని ఆరాధించినట్లైతే...?

కుబేరుడిని ఆరాధించినట్లైతే ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి చేకూరుతుంది. 
 
మేషం: యాదృచ్ఛికంగా పుణ్యక్షేత్రాలు, నూతన ప్రదేశాలు సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు సహచరులతో విందులు, వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులు ప్రియమైన వ్యక్తులకు ఆకర్షణీయమైన కానుకలందిస్తారు. వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. పచారీ, ఫ్యాన్సీ, ఆల్కహాల్ వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
వృషభం: ఆహార వ్యవహారాల్లో మెలకువ వహించండి. బంధువుల రాక కొంత అసౌకర్యం కలిగిస్తుంది. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టులను విడిపించుకుంటారు. సొంతంగా వ్యాపారాలకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. వృత్తుల వారికి శ్రమించిన కొలదీ ఆదాయం అన్నట్టుగా వుంటుంది. 
 
మిథునం: విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. కీలకమైన విషయాలు మీ జీవితభాగస్వామికి తెలియజేయటం శ్రేయస్కరం. విద్యార్థులు క్రీడ, క్విజ్, వ్యాసరచన పోటీల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నతస్థాయి అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో చికాకులు తప్పవు.
 
కర్కాటకం: ఆర్థిక ప్రగతి సామాన్యంగా వున్నా ఇబ్బందులుండవు. బంధుమిత్రులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు.
 
సింహం: మీ ఉన్నతిని చూసి ఎదుటివారు అపోహపడే ఆస్కారం వుంది. ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కుటుంబీకులు, బంధువుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు.
 
కన్య: భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి వేదాంత ధోరణి కనబరుస్తారు. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు.
 
తుల: సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. పెద్దలతో ఆస్తి విషయమై సంప్రదింపులు జరుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారు తప్పులు దొర్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. 
 
వృశ్చికం: ప్రైవేట్ సంస్థల్లోని వారికి ప్రతి విషయంలోను ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఏ విషయంలోను దంపతుల నడుమ దాపరికం మంచిది కాదని గమనించండి.
 
ధనస్సు: అర్థాంతరంగా నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు, సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఎంతో కొంత మొత్తం పొదుపు చేయాలనే మీ ప్రయత్నం ఫలించదు. నిరుద్యోగులు, చేతివృత్తుల వారికి తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మకరం: సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రికా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో వస్తువులు జారవిడుచుకునే ఆస్కారం వుంది. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా పనిభారం అధికమవుతుంది. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
 
కుంభం: పట్టు, చేనేత, ఫ్యాన్సీ, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. పీచు, ఫోమ్, లెదర్, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. ఐరన్, సిమెంట్, కలప, ఇటుక వ్యాపారస్తులకు కలిసిరాగలదు. నిర్మాణ పనుల్లో సంతృప్తి, పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి.
 
మీనం: ముఖ్యుల రాకపోకల వల్ల అనుకోని ఖర్చులు అధికమవుతాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకెంతో శుభం చేకూరుతుందని గమనించండి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం అధికమవుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా మీ తెలివితేటలతో పూర్తి చేయగలుగుతారు.