శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-01-2021 ఆదివారం దినఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించినా...

మేషం : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. అనుభవజ్ఞుల సలహా తీసుకోడం ఉత్తమం. వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సలహా తీసుకోవడం ఉత్తమం. 
 
వృషభం : వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. రావలసిన ఆదాయం సకాలంలో అందక ఆందోళన చెందుతారు. ఆప్తుల రాకతో గృహం సందడిగా మారుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పదు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు దూకుడు తగదు. కోళ్ళు, మత్స్యు, పాడి రంగాల వారికి ఆశాజనకం. 
 
మిథునం : దైవ దర్శనాలలో చికాకులు ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. బంధు మిత్రులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో చికాకులు తప్పవు. 
 
కర్కాటకం : అందరితో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. హామీలు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
సింహం : స్త్రీల అతి అలంకరణ విమర్శలకు దారితీస్తుంది. ఆలస్యమైనా పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. వాయిదాపడిన మొక్కుబడులు ఎట్టకేలకు తీర్చుకుంటారు. ముందస్తు జాగ్రత్తతో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కన్య : కుటుంబీకుల అవసరాలు, కోరికలు నెరవేర్చగలుగుతారు. వృత్తి వ్యాపారులకు బాధ్యతల్లతో ఏకాగ్రత అవసరం. ఎటువంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకోవద్దు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. జూదాలు, వ్యసనాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
తుల : వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించాలి. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఊహించని ఖర్చులు, విద్యుత్ బిల్లులు, చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. పట్టుదలతో శ్రమించినగానీ పనులు పూర్తికావు. స్త్రీల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రుణం తీసుకోడం, ఇవ్వడం క్షేమం కాదని గమనించండి. హోటల్, స్టాక్ మార్కెట్ లాభాలదిశగా సాగుతుంది. 
 
ధనస్సు : ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. వాణిజ్య ఒప్పందాలు, చెల్లింపుల్లో ఏకాగ్రత ప్రదానం. ధన వ్యయంతోనే సమస్యలు సానుకూలమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు ఆటుపోట్లు ఎదుర్కొనక తప్పదు. 
 
మకరం : ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. బంధువులు, అయినవారి రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచడం మంచిది. ఖర్చులకు వెనుకాడకుండా ధనం బాగా వెచ్చిస్తారు. విక్రయాలు బాగున్నా లాభాలు అంతంత మాత్రమే. అధికారుల వేధింపులు, తనిఖీలు ఆందోళనలు కలిగిస్తాయి. 
 
కుంభం : దైవ దర్శనాల్లో శ్రమ, ప్రయాసలెదుర్కొంటారు. చేతివృత్తులు, చిరువ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. ఇంట్లోనూ, సంఘంలో మీ మాటకు విలువ ఉండదు. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిదికాదు. 
 
మీనం : వృత్తి వ్యాపారాల వారికి ఆటంకాలు తొలగిపోతాయి. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు తొలగిపోతాయి. పందాలు, పోటీలలో జాగ్రత్త అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ప్రేమికులు, విద్యార్థులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ సంతానం భవిష్యత్ కోసం నూతన పథకాలు చేపడుతారు.