సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-01-2021 బుధవారం నాటి మీ రాశి ఫలితాలు-సత్యదేవుని పూజిస్తే..?

సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. సంతానం ఫీజులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఏకాగ్రత లోపం వల్ల విద్యార్థులకు మందలింపులు, చికాకులు అధికం.
 
వృషభం: సన్నిహితుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు అధికంగా వుంటాయి. బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగండి. కొబ్బరి పండ్ల, పూల, పనివారలకు శుభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యం.
 
మిథునం: భాగస్వామిక, సొంత వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగస్తులు తోటివారితో విందులు, వేడుకల్లో పాల్గొంటారు. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్ల శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. క్రీడా పోటీల్లో విద్యార్థుల అత్యుత్సాహ అనర్ధాలకు దారితీసే ఆస్కారం వుంది.
 
కర్కాటకం: ఉద్యోగస్తులు విలువైన కానుకలందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మిత్రుల మాటతీరు, వ్యవహార ధోరణి అసహనం కలిగిస్తాయి. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణల గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచడం మంచిది.
 
సింహం: స్త్రీలకు షాపింగ్‌లోను స్క్రీమ్‌ల పట్ల అవగాహన ముఖ్యం. విద్యార్థుల్లో ఏకాగ్రత, స్థిరత్వం నెలకొంటాయి. మొక్కుబడులు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఖర్చులు అధికంగా వున్నా అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
కన్య: కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ మాటను అందరూ గౌరవిస్తారు. పనులు అర్థాంతంగా ముగించాల్సి వస్తుంది. ఖర్చులు, కుటుంబ అవసరాలు అధికం. రావలసిన ధనం వసూలులో శ్రమ, ప్రయాసలెదుర్కుంటారు. స్త్రీలు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
తుల: ఉద్యోదస్తులకు హోదా పెరగడంతో పాటు బాధ్యతలు అధికమవుతాయి. ప్రముఖులతో కీలక చర్చల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా వుండాలి. వాహన చోదకులకు దూకుడు తగదు. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం: బంధుమిత్రులతో కచ్చితంగా వ్యవహరించండి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కుదుటపడతారు. రుణ సమస్యలు తొలగిపోతాయి. క్రయ విక్రయాలు లాభదాయకం. పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు అనుకున్నది సాధిస్తారు. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
ధనస్సు: ఆచితూచి అడుగు వేయండి. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. మీ వైఖరి కొంతమందికి నచ్చకపోవచ్చు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఆశయసిద్ధికి మరింతగా శ్రమించాలి. కానుకలు, శుభాకాంక్షలు అందుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి.
 
మకరం: వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారులకు ఆశాజనకం. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సమస్యలెదురవుతాయి. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త.
 
కుంభం: భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలను సందర్శిస్తారు.
 
మీనం: ఆర్థికస్థితి సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. కుటుంబ సమస్యలు గోప్యంగా వుంచండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.