బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (19:43 IST)

26-06-2022 నుంచి 02-07-2022 వరకు మీ వార రాశిఫలాలు

weekly astro
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. అవసరాలకు ధనం సర్దుబాటువుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆదివారం ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనల్లో, మార్పు వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సోదరీసోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ శ్రీమతి దగ్గర ఏదీ దాచవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థల మార్పు అనివార్యం ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. కీలక సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
మీదైన రంగంలో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. పరిచయాలు బలపడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థలో మదుపు తగదు. సోమ, మంగళవారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త, పనులు హడావుడిగా సాగుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. అధికారులకు కొత్త బాధ్యతలు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. వాహన చోదకులకు దూకుడు తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఆర్థిక సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. బుధ, గురువారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. బిల్డర్లు, కార్మికులకు పనులు లభిస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతగా శ్రమిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహమార్పు అనివార్యం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అవివాహితులకు శుభయోగం. శుక్ర, శనివారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ప్రముఖులను కలిసినా ప్రయోజనం ఉండదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. హోల్సేల్ వ్యాపారులకు కష్టకాలం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సాంకేతిక రంగాల వారికి బాగుంటుంది. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
ప్రతికూలతలు తొలగుతాయి. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. పెద్దల సలహా పాటిస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. తల పెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. 'సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. శనివారం నాడు నగదు, వస్తువులు జాగ్రత్త, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ధార్మిక విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉపాధి పథకాలు చేపడతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
పట్టుదలకు పోవద్దు. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఒంటెద్దు పోకడ తగదు. శ్రీమతి సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఆది, సోమవారాల్లో పనులు అనుకున్న విధంగా సాగవు, ఆలోచనల్లో మార్పు వస్తుంది. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ధనప్రలోభాలకు లొంగవద్దు. గిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపుల స్థలమార్పు అనివార్యం కార్మికులకు పనులు లభిస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
ఈ వారం అనుకూలమే. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. రావలసిన ధనం అందుతుంది. వివాదాలు సద్దుమణుగుతాయి ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో మెలకువ వహించండి. స్తోమతకు మించి హామీలివవ్వవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వాస్తుదోష నివారణ అనివార్యం. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు సహోద్యోగులతో జాగ్రత్త. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. మీ ప్రతిపాదనలకు స్పందన ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. బంధువులతో విభేదిస్తారు. పెద్దల సలహా కలిసివస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సంతానం విజయం ఉల్లాసాన్నిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాన్నిస్తాయి. ఆరోగ్యం సంతృప్తికరం. నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 234 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనించవు. ఒక సమస్య నుంచి బయటపడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మంగళ, బుధవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మీటలు పట్టించుకోవద్దు. అవివాహితులకు శుభయోగం. గృహమార్పు కలిసివస్తుంది. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. మార్కెటింగ్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఆది, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. గుట్టుగా యత్నాలు సాగించండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రియతములను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు, ప్రణాళికలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంది. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో మెలగండి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. పత్రాలు అందుకుంటారు. అవివాహితులకు శుభయోగం. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. కొత్త ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శన ఉల్లాసాన్నిస్తుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాజాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. బుధ, గురువారాల్లో పనులు సాగవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం విజయం ఉల్లాసాన్నిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. వృత్తులు, కార్మిక రంగాల వారికి పనుల లభిస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.