గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: మంగళవారం, 2 ఆగస్టు 2016 (21:24 IST)

మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆయుర్వేదం ఏ ఆహారం సూచిస్తుంది?

ఆయుర్వేదంలో వాతాన్ని అంటే నాడీమండలాన్ని శాంతపరిచే ఆహారం తీసుకోమంటుంది. కొంచెం కారం, ఉప్పు, ఉన్న వంటలు తీసుకోవడం మంచిది. రాత్రి వేడిపాలు, పటికబెల్లం, కలిపి మానసమిత్రవటిని కాని, శంఖపుష్పిమాత్ర కానీ తీసుకోవాలి. ప్రతిరోజూ వేడి చేసిన ధన్వంతరీ తైలంతో కానీ

ఆయుర్వేదంలో వాతాన్ని అంటే నాడీమండలాన్ని శాంతపరిచే ఆహారం తీసుకోమంటుంది. కొంచెం కారం, ఉప్పు, ఉన్న వంటలు తీసుకోవడం మంచిది. రాత్రి వేడిపాలు, పటికబెల్లం, కలిపి మానసమిత్రవటిని కాని, శంఖపుష్పిమాత్ర కానీ తీసుకోవాలి.
 
ప్రతిరోజూ వేడి చేసిన ధన్వంతరీ తైలంతో కానీ, నువ్వుల నూనెతో కానీ ఒంటిని మర్దన చేసుకుని స్నానం చేయాలి. పులుపు లేని తియ్యని పళ్ల రసం తాగాలి. అన్నిటికీ మించి రాత్రి పదిగంటలకు పడుకోవడం అలవాటు చేసుకోండి. 
 
మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు విటమిన్ సి ఉన్న సహజమైన ఆహారం ఉపకరిస్తుంది. బత్తాయి, ద్రాక్ష, క్యాలీఫ్లవర్, నారింజ, నిమ్మ, మామిడిపళ్లలో ఇది ఉంటుంది.
 
మెగ్నీషియం ఉన్న గోధుమ, బాదం, పొద్దుతిరుగుడు పూల విత్తనాలు, వాటి నుంచి వచ్చిన పదార్థాలు తీసుకోండి. ఉదయం పెరుగు, వెన్న, పాలు తీసుకోండి.