1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. Benefits of drinking milk with jaggery

బెల్లం కలిపిన వేడిపాలు తాగితే...

సాధారణంగా పాలలో చక్కెరను కలుపుకుని సేవిస్తుంటారు. అదే బెల్లం కలుపుకుని తాగితే... అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెపుతున్నారు. ఎందుకంటే... బెల్లం, పాలలో ఐరన్, సోడియం, పొటాషియం వంటి అన

jaggery
సాధారణంగా పాలలో చక్కెరను కలుపుకుని సేవిస్తుంటారు. అదే బెల్లం కలుపుకుని తాగితే... అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెపుతున్నారు. ఎందుకంటే... బెల్లం, పాలలో ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. 
 
పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు. రోజూ వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందవచ్చు. ముఖ్యంగా బెల్లం క‌లిపిన వేడి పాల‌ను తాగడం వ‌ల్ల వాటిలో ఉండే పోష‌కాలు అంది జుట్టు కాంతివంతంగా మారుతుంది. వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. చుండ్రు పోతుంది.
 
ఇకపోతే.. బెల్లంకు అనీమియా ఎదుర్కొనే శక్తి ఉంది. మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను తీసుకోవడం ఎంతే శ్రేయస్కరమని చెపుతున్నారు. బెల్లం కలిపిన పాలను తాగడం వల్ల మహిళలకు రుతుక్రమంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకలను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను, మెటాబలిజమ్ ను మెరుగుపరుస్తుంది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోండి.. ఊబకాయాన్ని దూరం చేసుకోండి... టిప్స్