శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (13:51 IST)

ఆరు భాషల్లో బీబీసీ వాయిస్ యాక్టివేట్ బులెటన్

భారత్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీబీసీ వార్తా సంస్థ వాయిస్ యాక్టివేట్ బులెటన్ ఆవిష్కరణను ప్రవేశపెట్టింది. దీంతో పాటు మరికొన్ని కొత్త స్కీమ్‌లను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది.

ఈ బులిటెన్, సెట్ టెక్నాలజీ ద్వారా రోజూ వాస్తవమైన వార్తలపై పరిశోధన జరుగుతుంది. ఈ ప్రత్యేక స్కీమ్ గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రవేశపెట్టడం జరిగింది. దేశ వ్యాప్తంగా గల బీబీసీ న్యూస్ పాఠకులు ఈ ఆరు భాషలతో పాటు ఆంగ్లంలో అద్భుతమైన కవరేజ్, ప్రత్యేక ఇంటర్వ్యూలు, నిపుణుల విశ్లేషణపై పరిశోధన జరుపుకుంటుంది. 
 
ముఖ్యంగా ఎన్నికలు, భావి భారత ఓటర్ల అంచనాలు, నిరుత్సాహాలు, ఎన్నికలపై వారికున్న దృష్టిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. వ్యవసాయ సంక్షోభం నుండి సామాజిక నేరాల వరకు, ప్రతిదానిని బీబీసీ జాగ్రత్తగా పర్యవేక్షిస్తుంది. బీబీసీ వరల్డ్ న్యూస్, బీబీసీ డాట్‌ కామ్ ద్వారా పార్టీల ప్రచారం, ఉపాధి, భద్రత, జాతీయతావాదం, గ్రామీణ ఓట్ల సమీకరణ, కుల ఓట్లు, యువ ఓటర్ల వివరాలు, మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న అకృత్యాలకు సంబంధించిన అంశాలపై బీబీసీ శ్రద్ధ వహిస్తోంది.
 
ఎన్నికల నేపధ్యంలో బిబిసి ఇండియా ప్రాంతీయ రాజకీయ నాయకులతో పాటు మేధావుల అభిప్రాయాలను పంచుకునేందుకు ఆయా పట్టణాల్లో సమావేశాలను నిర్వహించింది. ముంబై, పాట్నా, అహ్మదాబాద్, చండీగర్, చెన్నై, తిరుపతి, విశాఖపట్టణం మరియు విజయవాడలలో ఈ సమావేశాలను నిర్వహించడం జరిగింది.