మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (10:36 IST)

కంటి చుట్టూ వలయాలను దూరం చేసుకోవాలంటే? అరటి పండే చాలు..

కంటి చుట్టూ వలయాలను దూరం చేసుకోవాలంటే.. అరటి పండే సరిపోతుందని బ్యూటీషన్లు అంటున్నారు. అరటి పండు గుజ్జును కళ్ల చుట్టూ రాసుకుని పావు గంట తర్వాత చల్లటి నీళ్లలో కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా కంటి చుట్టూ ఏర్

కంటి చుట్టూ వలయాలను దూరం చేసుకోవాలంటే.. అరటి పండే సరిపోతుందని బ్యూటీషన్లు అంటున్నారు. అరటి పండు గుజ్జును కళ్ల చుట్టూ రాసుకుని పావు గంట తర్వాత చల్లటి నీళ్లలో కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలు తగ్గిపోతాయి. 
 
అలాగే అరటి పండు గుజ్జును ముఖ సౌందర్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అరటిపండు గుజ్జులో మూడు టీ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై మాస్క్‌లా వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మం పొడిబారడం తగ్గిపోతుంది. 
 
అలాగే అరటిపండు స్క్రబ్ ద్వారా చర్మాన్ని ముడతల నుంచి కాపాడుకోవచ్చు. పంచదార కలిపిన అరటిపండు గుజ్జుతో ఫేస్‌కు మర్దన చేసుకుంటే.. మృత కణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
చర్మం మెరిసిపోవాలంటే.. అరటి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని వేడి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం మెరిసిపోతుందని బ్యూటీషన్లు చెప్తున్నారు.