బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : ఆదివారం, 18 జూన్ 2017 (17:47 IST)

పెదవులు నల్లగా మారిపోతే.. గులాబీ రేకులతో ఇలా చేయండి..

పెదాలు నల్లగా మారి ఇబ్బందిగా కనిపిస్తున్నప్పుడు గులాబీ పూల పూత వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గులాబీ రేకుల్ని మెత్తగా చేసి దానికి కొద్దిగా నిమ్మరసం, పంచదార కలిపి రాసుకుంటే రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంట

పెదాలు నల్లగా మారి ఇబ్బందిగా కనిపిస్తున్నప్పుడు గులాబీ పూల పూత వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గులాబీ రేకుల్ని మెత్తగా చేసి దానికి కొద్దిగా నిమ్మరసం, పంచదార కలిపి రాసుకుంటే రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మృదువుగా మారతాయి. అలాగే చర్మం కమిలిపోయినట్లు కనిపిస్తే.. గులాబీ రేకుల నుంచి స్వాంతన పొందవచ్చు.
 
చర్మం తేమను కోల్పోయి పొడిబారి కాంతివిహీనంగా తయారైతే గులాబీ పూలను ముద్దగా చేసుకుని దానికి చెంచా తేనె, కాసిని పాలు కలుపుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు పూతలా వేసుకుని అరగంటాగి చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా కనీసం వారంలో రెండు మూడుసార్లు చేస్తుంటే చర్మానికి తగిన తేమ అందుతుంది. చర్మం తాజాగా కనిపిస్తుంది. 
 
గులాబీ రేకుల్ని చేత్తో నలిపి, కాస్తంత పంచదార, కొన్ని పుదీనా ఆకులూ, కాసిని పాలూ కలిపి ఆ మిశ్రమాన్ని ఐస్‌ట్రేలోకి తీసుకుని ఫ్రిజ్‌లో ఉంచాలి. బయటి నుంచి తిరిగి వచ్చాక వాటిని ముఖానికి రుద్దుకుంటే సరి. చర్మం తాజాగా కనిపిస్తుంది.