కంటి అలసట తొలగిపోవాలంటే?

కంటి అలసట తొలగిపోవాలంటే... కీరను చక్రాల్లా కోసి కళ్లపై ఉంచుకుని పదినిమిషాల తరువాత తీసేయాలి. కళ్ల అలసట పోతుంది. కంటి మంట తగ్గిపోతుంది. అదేపనిగా కంప్యూటరుతో పనిచేసేవాళ్లు కళ్లకు సంబంధించిన వ్యాయామాల్ని

Written By selvi
Updated: మంగళవారం, 24 అక్టోబరు 2017 (11:21 IST)
కంటి అలసట తొలగిపోవాలంటే... కీరను చక్రాల్లా కోసి కళ్లపై ఉంచుకుని పదినిమిషాల తరువాత తీసేయాలి. కళ్ల అలసట పోతుంది. కంటి మంట తగ్గిపోతుంది. అదేపనిగా కంప్యూటరుతో పనిచేసేవాళ్లు కళ్లకు సంబంధించిన వ్యాయామాల్ని కచ్చితంగా చేయాలి. ముందు కళ్లను గుండ్రంగా తిప్పాలి. తరవాత కుడి, ఎడమలవైపు తిప్పాలి. ఇలా రోజులో కుదిరినప్పుడల్లా చేస్తే అలసట దూరమవుతుంది. కళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి.
 
అలాగే కీరదోస రసంలో కాస్త గులాబీనీరు కలిపి అందులో దూది ఉండల్ని ముంచి కళ్లపై పెట్టుకోవాలి. అవి ఆరిపోయాక తీసేస్తే అలసట పోవడమే కాదు.. కళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కళ్ల అలసటను దూరం చేసి, సాంత్వన అందించడంలో తేనె, పాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. 
 
రెండు చెంచాల తేనెలో కాసిని పాలు కలిపి కళ్ల చుట్టూ నెమ్మదిగా దూదితో రాసుకోవాలి. ఇది బాగా ఆరాక చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే ఫలితం ఉంటుంది. కళ్ల మంట కూడా తగ్గుతుంది. ఒక బంగాళాదుంపను తురిమి దాన్ని కళ్లపై పెట్టుకోవాలి. బాగా ఆరాక కడిగేస్తే చాలు. అలసట పోవడమే కాదు, నల్లనివలయాలూ తొలగిపోతాయని బ్యూటీషియన్లు అంటున్నారు.

అన్నీ చూడండి

తెలంగాణలో భారీ వర్షాలు... జగిత్యాలలో అత్యధికంగా 76.8 మి.మీ వర్షపాతం నమోదు

ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ మహిళా ఎంపీ మద్దతు - కుమార్తె మాత్రం కాక్రోచ్ పార్టీకి సపోర్టు

వైఎస్ షర్మిలకు ఏమైంది? త్వరగా కోలుకోవాలంటున్న బాబు, పవన్, లోకేశ్

ఇకపై క్రియాశీలక ఎన్నికల్లో పోటీ చేయను : సిద్ధరామయ్య

గొడ్డలి పార్టీ నేతలతో వేదికను పంచుకోవద్దు : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం

పౌరసత్వాన్ని వదులుకుంటానంటున్న అఖిల్ అక్కినేని

కోర్కెలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చా : రకుల్ ప్రీత్ సింగ్

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments