బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (09:39 IST)

ఆలివ్, కొబ్బరి నూనెల మిశ్రమాన్ని?

మృతకణాలు తొలగించుకునేందుకు ఖరీదైన క్లెన్సర్లు వాడటం కంటే కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్‌ల మిశ్రమాన్ని వాడితే సరిపోతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. ఆలివ్ నూనె, కొబ్బరి నూనె మిశ్రమంలో కొద్దిగా పంచదార వేసి మెడ

మృతకణాలు తొలగించుకునేందుకు ఖరీదైన క్లెన్సర్లు వాడటం కంటే కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్‌ల మిశ్రమాన్ని వాడితే సరిపోతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. ఆలివ్ నూనె, కొబ్బరి నూనె మిశ్రమంలో కొద్దిగా పంచదార వేసి మెడకు, మోచేతులు, ముఖం, పెదాలకు రాసుకుంటే మృతకణాలు పోవడంతోపాటు చర్మం తేమతో నిగనిగలాడుతుంది. 
 
గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా మొక్కజొన్నపిండి కలిపి దాన్ని సమస్య ఉన్నచోట పూతలా వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరిపోయాక కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది. నాణ్యమైన క్రీమ్ రాసుకున్నా కొన్నిసార్లు చర్మంలో మెరుపు ఉండదు. అలాంటప్పుడు బంగాళాదుంప తొక్క ఉడికించిన నీటిని ముఖానికి రాసుకుంటే చర్మం మెరిసిపోతుంది. 
 
స్నానం చేసే నీటిలో రెండు చుక్కల ఆలివ్‌నూనె వేసుకుని స్నానం చేస్తే చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా చేస్తే స్నానం తర్వాత ప్రత్యేకించి మాయిశ్చరైజర్‌ రాయాల్సిన అవసరం కూడా ఉండదని బ్యూటీషియన్లు చెప్తున్నారు.