వంటసోడాతో నలుపుదనానికి చెక్.. ఎలా?
వంటసోడాను వంటల్లోనే కాదు.. సౌందర్య పోషణకు కూడా వాడొచ్చు. శరీరం నలుపు తిరిగిపోతే కాసిని నీళ్లు కలిపి బాహుమూలల్లో రాసుకోవాలి. దీనివల్ల నలుపుదనం పోయి.. దుర్వాసన కూడా తగ్గుతుంది. ఇది నలుపుదనానికీ కారణమయ్య
వంటసోడాను వంటల్లోనే కాదు.. సౌందర్య పోషణకు కూడా వాడొచ్చు. శరీరం నలుపు తిరిగిపోతే కాసిని నీళ్లు కలిపి బాహుమూలల్లో రాసుకోవాలి. దీనివల్ల నలుపుదనం పోయి.. దుర్వాసన కూడా తగ్గుతుంది. ఇది నలుపుదనానికీ కారణమయ్యే బ్యాక్టీరియాను నశింపజేస్తుంది.
అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవాలంటే.. రెండు చెంచాల చొప్పున తేనె, నిమ్మరసం తీసుకుని ఈ మిశ్రమాన్ని బాహుమూలల్లో రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. రెండురోజులకోసారి ఇలా చేస్తుంటే సమస్య అదుపులోకి వస్తుంది.
కొబ్బరినూనె: ఇది కూడా నలుపుదనం పోగొట్టడంలో తోడ్పడుతుంది. కొన్ని చుక్కల నూనెను ఆ ప్రాంతంలో రాసి, పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా స్నానం చేసేముందు రోజూ రాసుకుంటుంటే చాలా తక్కువ సమయంలోనే మార్పు కనిపిస్తుంది.
కీరదోస: చక్రాల్లా తరిగిన కీరదోస ముక్కల్ని బాహుమూలల్లో రుద్దుకోవాలి. పదిహేను నిమిషాలయ్యాక స్నానం చేస్తే.. మృతకణాలు పోవడంతోపాటూ.. నలుపు కూడా తగ్గుతుందని బ్యూటీషియన్లు అంటున్నారు.