బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (11:08 IST)

క్లెన్సర్లు వాడొద్దు.. ఆ నూనెలే చాలు..

ముఖంపై వున్న మృతకణాలు తొలగించుకునేందుకు ఖరీదైన క్లెన్సర్లు వాడుతున్నారా? అయితే ఇక అలాంటి అవసరం లేదు. కొబ్బరినూనె, ఆలివ్‌నూనెలతో చేసిన మిశ్రమానికి మించిన క్లెన్సర్‌ మరొకటి లేదు. ఈ మిశ్రమంలో కొద్దిగా చక

ముఖంపై వున్న మృతకణాలు తొలగించుకునేందుకు ఖరీదైన క్లెన్సర్లు వాడుతున్నారా? అయితే ఇక అలాంటి అవసరం లేదు. కొబ్బరినూనె, ఆలివ్‌నూనెలతో చేసిన మిశ్రమానికి మించిన క్లెన్సర్‌ మరొకటి లేదు. ఈ మిశ్రమంలో కొద్దిగా చక్కెర కానీ, బ్రౌన్‌షుగర్‌ కానీ వేసుకుని మెడా, మోచేతులూ, ముఖం, పెదాలకు రాసుకుంటే మృతకణాలు పోవడంతోపాటూ... చర్మం తేమతో నిగనిగలాడుతుంది. 
 
అలాగే కోడిగుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా మొక్కజొన్నపిండి కలిపి దాన్ని సమస్య ఉన్నచోట పూతలా వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరిపోయాక కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది. నాణ్యమైన క్రీమ్ రాసుకున్నా కూడా కొన్నిసార్లు చర్మంలో మెరుపు ఉండదు. అలాంటప్పుడు బంగాళాదుంప తొక్క ఉడికించిన నీటిని ముఖానికి రాసుకుంటే తప్పకుండా మార్పు కనిపిస్తుంది.