శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (15:26 IST)

సహజ క్లెన్సర్లేంటో తెలుసుకోండి.. కలబంద, చక్కెరను మిక్స్ చేసి?

యాపిల్ ముక్కలను గుజ్జుగా చేసి అందులో రెండు చెంచాల పెరుగు, ముఖానికి రాసుకోవాలి. ఓ పావుగంటయ్యాక తడి చేసి కడిగేసుకోవాలి. రెండు చెంచాల కలబంద గుజ్జులో ఒక చెంచా చక్కెర..కొద్దిగా తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన

క్లెన్సర్లను కొనేస్తున్నారా? అయితే ఆగండి. క్రీములు, క్లెన్సర్లను కొనడం ద్వారా చర్మానికి ముప్పు తప్పదని, తద్వారా చర్మం పాడడంతో పాటు పలు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. మన ఇంట్లోనే సహజ క్లెన్సర్‌లున్నాయని వాటిని వాడితేనే సరిపోతుందని వారు చెప్తున్నారు. నిమ్మ తొక్కల పొడిలో కాసిన్ని పాలు చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ముఖం.. మెడకు రాసుకుని మర్దన చేసుకోవాలి.
 
అలాగే యాపిల్ ముక్కలను గుజ్జుగా చేసి అందులో రెండు చెంచాల పెరుగు, ముఖానికి రాసుకోవాలి. ఓ పావుగంటయ్యాక తడి చేసి కడిగేసుకోవాలి. రెండు చెంచాల కలబంద గుజ్జులో ఒక చెంచా చక్కెర..కొద్దిగా తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మెల్లిగా మర్దన చేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేయడం ద్వారా మురికి దూరమై చర్మం మృదువుగా తయారవుతుందని.. బ్యూటీషన్లు అంటున్నారు.