శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By pnr
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (10:57 IST)

తడి జుట్టుతో కలిగే నష్టాలేంటి?

చాలా మంది మహిళలు తల స్నానం చేసి తడి జట్టును ముడి వేసుకుంటారు. అలాగే, పురుషులు కూడా తలస్నానం చేశాక వెంట్రుకలు ఆరబెట్టుకోరు. ఇలాంటి తడి జుట్టు వల్ల అనేక నష్టాలు ఉన్నాయి.

చాలా మంది మహిళలు తల స్నానం చేసి తడి జట్టును ముడి వేసుకుంటారు. అలాగే, పురుషులు కూడా తలస్నానం చేశాక వెంట్రుకలు ఆరబెట్టుకోరు. ఇలాంటి తడి జుట్టు వల్ల అనేక నష్టాలు ఉన్నాయి.
 
ముఖ్యంగా, తలస్నానం చేసినపుడు జట్టు మొత్తాన్ని పొడివస్త్రంతో తుడిసి ఆరబెట్టుకోవాలి. దువ్వెనతో తడి జుట్టును దువ్వుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి జుట్టు రాలిపోయి, చిట్లిపోయే ప్రమాదం ఉంది. పైగా, చండ్రు కూడా వచ్చే అవకాశం ఉంది. 
 
అన్నిటికంటే ముఖ్యంగా, తడి జట్టుతోనే నిద్రపోతే దీర్ఘకాల తలనొప్పివచ్చే అవకాశం మెండుగా ఉంది. పైగా, జట్టు ఆరబెట్టుకోకుండా పడుకుంటే ఉదయం నిద్రలేచే సమయానికి చిక్కులు పడుతుంది. జుట్టులో పోషణ గుణాలు కూడా తగ్గిపోతాయి.