బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2017 (15:10 IST)

బట్టతలకు చెక్ పెట్టే నెయ్యి..

జుట్టు చివర్లో చిట్లుతున్నాయా? అయితే నెయ్యిని ఇలా వాడండి అంటున్నారు బ్యూటీషియన్లు. నెయ్యిని ఓ బౌల్‌లో తీసుకుని దాన్ని జుట్టు చివర్లలో రాయాలి. 20 నిమిషాల తర్వాత దువ్వెనతో దువ్వేసుకుని.. ఆపై మైల్డ్ షాంప

జుట్టు చివర్లో చిట్లుతున్నాయా? అయితే నెయ్యిని ఇలా వాడండి అంటున్నారు బ్యూటీషియన్లు. నెయ్యిని ఓ బౌల్‌లో తీసుకుని దాన్ని జుట్టు చివర్లలో రాయాలి. 20 నిమిషాల తర్వాత దువ్వెనతో దువ్వేసుకుని.. ఆపై మైల్డ్ షాంపూతో కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. అలాగే చుండ్రుకు చెక్ పెట్టడంలోనూ నెయ్యి భేష్‌గా పనిచేస్తుంది. 
 
గోరువెచ్చని నెయ్యికి బాదం నూనె కలిపి కురుల మొదళ్లలో రాసుకుని 20 నిమిషాల పాటు వుంచాలి. తర్వాత నూనె పోయేలా రోజ్ వాటర్‌తో శిరోజాలను కడిగేయాలి. నెలకు రెండు సార్లు ఇలా చేసి చూస్తే మంచి ఫలితం వుంటుందని బ్యూటీషియన్లు అంటున్నారు.
 
అలాగే నెయ్యి శిరోజాలకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. మూడు చెంచాల నెయ్యిని ఆలివ్ ఆయిల్‌తో కలిపి వెంట్రులకు రాసుకుని అరగంట పాటు వుంచి.. ఆపై మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే కురులు నిగనిగలాడుతాయి. బట్టతల నుంచి తప్పించుకోవాలంటే.. మాసానికి ఓసారి నెయ్యిని కురులకు పట్టించడం చేయాలి. 
 
ఐదు స్పూన్ల నెయ్యికి పది బాదం పలుకులు కలిపి వేడి చేసి అవి నలుపుగా మారాక వాటిని నెయ్యి నుంచి తొలగించాలి. ఆ నూనెను మాడుకు పట్టించాలి. మూడు గంటలకు తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. మైల్డ్ షాంపును ఉపయోగించడం మరువకూడదు. ఇలా చేస్తే బట్టతల సమస్యను దూరం చేసుకోవచ్చు.