శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 జులై 2017 (09:58 IST)

జుట్టు రాలకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి

జుట్టు రాలకుండా ఉండాలంటే.. తరచూ తలకు నూనె రాస్తుండాలి. వారానికి ఒకసారి హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ చేయాలి. ఇందుకోసం కొబ్బరి నూనెను వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే కుదుళ్లకు పట్టించి మసాజ్‌ చేయాలి. ఇలా చేస

జుట్టు రాలకుండా ఉండాలంటే.. తరచూ తలకు నూనె రాస్తుండాలి. వారానికి ఒకసారి హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ చేయాలి. ఇందుకోసం  కొబ్బరి నూనెను వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే కుదుళ్లకు పట్టించి మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకల కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. తలస్నానం చేశాక టవల్‌తో వెంట్రుకలను సున్నితంగా తుడిచి ఆరబెట్టాలి. గట్టిగా రుద్దితే వెంట్రుకలు తెగిపోతాయి.
 
దువ్వెనలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే దాన్లో ఇరుక్కున్న మట్టి వల్ల వెంట్రుకలు ఊడే సమస్య తలెత్తవచ్చు. జుట్టు తరచూ రాలుతుంటే.. షాంపూను మార్చి చూడాలి. సున్నితమైన షాంపూలనే ఎంచుకోవాలి. శరీరంలో పోషకాలు లోపిస్తే జుట్టు రాలుతుంది. కాబట్టి మాంసకృతులతోపాటు ఐరన్‌, జింక్‌, విటమిన్‌ ఎ, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌ దొరికే పోషకాహారం తినాలని న్యూట్రీషన్లు అంటున్నారు.