సన్నగా, నాజూగ్గా కనిపించాలంటే.. చెర్రీలు బ్రొకొలి తీసుకోవాలి..!

సన్నగా, నాజుగ్గా అందంగా కనిపించాలని చాలామంది తాపత్రయపడుతుంటారు. అందమైన శరీరం పొందడం అంత కష్టమైన పనేమి కాదు. ఆరోగ్యవంతమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తే ఎవరైనా తమ శరీరాకృతిని చక్కగా ఉంచుకోవచ్

సోమవారం, 13 జూన్ 2016 (16:11 IST)
సన్నగా, నాజుగ్గా అందంగా కనిపించాలని చాలామంది తాపత్రయపడుతుంటారు. అందమైన శరీరం పొందడం అంత కష్టమైన పనేమి కాదు. ఆరోగ్యవంతమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తే ఎవరైనా తమ శరీరాకృతిని చక్కగా ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
 
* సరైన వేళకి సరైన ఆహారం తీసుకోవాలి. సమతులాహారం శరీరానికి అవసరం. దీనివల్ల మీరు ఎంతో ఎనర్జిటిక్‌గా తయారవుతారు. 
 
* వ్యాయామాలు చేసే ముందర ఓట్స్‌, గుడ్లు లేదా గుప్పెడు బాదంపప్పులు లేదా ప్రొటీన్‌షేక్‌ తీసుకోవాలి.
 
* జిమ్‌లో వెయిట్స్‌ ఎత్తడం చాలామంది అమ్మాయిలు చేయరు. అలా చేస్తే తమ శరీరానికి ఎక్కడ హాని కలుగుతుందోనని భయపడుతుంటారు. కానీ వెయిట్స్‌ ఎత్తడం కూడా శరీర ఫిట్‌నె‌స్‌కు ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల కండరాల్లో బలం పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ వర్కవుట్లుని మానివేయకూడదు. పుషప్స్‌, సిటప్స్‌, వాకింగ్‌ స్క్వాట్స్‌ వంటివి చేస్తే శరీరానికి ఎంతో మంచిది.
 
* వర్కవుట్లు చేసే ముందు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత మూడుసార్లు తప్పకుండా నీళ్లు తాగాలి.
 
* ఒత్తిడి నుంచి బయటపడడానికి పండ్లు, కూరగాయలు, చెర్రీలు, బ్రొకొలి వంటివి తరచూ తీసుకోవాలి.

అన్నీ చూడండి

ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటుపరంకానుందా? ప్రభుత్వ వివరణ ఏంటి?

వైకాపా మాజీ మంత్రి రజనీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు - పాస్‌పోర్టు అప్పగింత

భవిష్యత్‌‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ : సీఎం చంద్రబాబు

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రొఫెసర్ మనీషా అరెస్టు

భార్యను గొడ్డలితో నరికేసి ఠాణాకు వెళ్లి లొంగిపోయిన వృద్ధుడు

అన్నీ చూడండి

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

తర్వాతి కథనం
Show comments