Festival Posters
✕

వామ్మో చలిపులి... చర్మం పగలకుండా జాగ్రత్తలు ఇవే...

Written By సిహెచ్
Updated: బుధవారం, 19 డిశెంబరు 2018 (11:14 IST)
చలికాలం వచ్చేసింది. సాధారణంగా ఈ కాలం అంటే చాలామంది ఇష్టపడతారు. చల్లటి వాతావరణంలో బయట తిరగటానికి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తారు. కాని చల్లదనం శరీరానికి ఎంతమంచిదైనా, అది చర్మానికి  అప్పుడప్పుడు హాని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో చర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఎలాగో చూద్దాం.
 
1. ఏ కాలంలోనైనా చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో నీటి పరిమాణం తగినంత తప్పనిసరిగా ఉండాల్సిందే. చర్మ కణాలు నిరంతరం వాటి పని అవి చేసుకుపోవాలంటే చర్మానికి నీరు ఎంతో అవసరం. కనుక సాధ్యమైనంత నీరు తాగుతూ ఉండాలి. దీనివలన చర్మంలో తేమ ఉండి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పండ్లరసాలు, హెర్బల్ టీ లాంటివి కూడా చర్మానికి మేలు చేస్తాయి.
 
2. ముఖ్యంగా ఈ కాలంలో చర్మంలో నూనె ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో చర్మం పొడిబారి అందవిహీనంగా, ముడతలుగా, పొలుసులుగా కనిపిస్తుంది. కనుక వారానికి ఒకసారి ఎక్స్ ఫొలియేట్ తప్పకుండా చేసుకోవాలి. దీనివల్ల చర్మంలో పేరుకున్న మృతకణాలన్నీ  తొలగిపోతాయి. 
 
3. ముఖ్యంగా ఈ కాలానికి తగిన విధంగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. విటమిన్ సి, బి, ఈ, జింక్, మెగ్నీషియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ కాలంలో పండ్లను ఎక్కువుగా తీసుకోవటం మంచిది. 
 
4. ముఖ్యంగా పెదాలు ఈ కాలంలో పొడిబారి పగుళ్లు రావడం జరుగుతుంది. కనుక చలికాలంలో పెదాలకు లిప్ బామ్ లేదా నెయ్యిని రాసుకోవచ్చు. ఈ కాలంలో పాదాల పగుళ్లు కూడా బాధ పెడుతుంటాయి. పగిలిన పాదాలను రాత్రి నిద్రించటానికి ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి నానబెట్టాలి. తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకొని వైట్ పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పాదాల పగుళ్లు పోవడమే కాకుండా మృదువుగా ఉంటాయి.
 
5. అన్నింటి కంటే శారీరక వ్యాయామం ద్వారా చర్మాన్ని మరింత ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు. వ్యాయామం కారణంగా చర్మంలోని మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. పైగా ఈ కాలంలో వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్సాహవంతంగా ఉంటుంది.

అన్నీ చూడండి

కిర్గిజ్‌స్థాన్‌లో అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ షారన్ రాచెల్ అబీ అద్భుత ప్రదర్శన, రూ. 3 లక్షల ప్రోత్సాహక పురస్కారం

ఉప ముఖ్యమంత్రిని ఎంపవర్ స్టార్ అని అభివర్ణించిన ఉపాసన (video)

బీజేపీకి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గుడ్‌బై... నేడు తుది నిర్ణయం

రోడ్డు ప్రమాదాలను చూస్తే కన్నీళ్ళొస్తున్నాయి : కేంద్ర మంత్రి గడ్కరీ

వదినతో మరిది వివాహేతర సంబంధం, పెళ్లి వద్దన్నదని చంపేసాడు

అన్నీ చూడండి

డెహ్రాడూన్ ఐఎస్‌బిటి ఘటన స్ఫూర్తితో అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్ చిత్రం ఫస్ట్ లుక్

Bellamkonda Sai: వరుస నేరాలు వెనుక భారీ కుట్ర ఛేధించే అధికారిగా టైసన్ నాయుడు

Sharwa: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామం కథ గా శర్వా భోగి విడుదల తేదీ మార్పు

సమంతకు మగబిడ్డ పుట్టడం, పేరు పెట్టడం అన్నీ జరిగిపోయాయ్

Naga Chaitanya: వృషకర్మ లో చిన్నారికి కళ్లుగా మారిన ట్రెజర్ హంటర్ అర్జున్ ఏం చేశాడు?

తర్వాతి కథనం
Show comments