శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2017-18
Written By pnr
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (13:57 IST)

అమరావతికి భూములిచ్చిన రైతులకు అరుణ్ జైట్లీ వరం

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములిచ్చిన రైతులకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఓ వరమిచ్చారు. ఈ రైతులందరికీ... మూలధన పన్ను లాభాల (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) నుంచి మినహ

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములిచ్చిన రైతులకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఓ వరమిచ్చారు. ఈ రైతులందరికీ... మూలధన పన్ను లాభాల (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) నుంచి మినహాయింపును ఇచ్చారు. 
 
బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2017-18 వార్షిక బడ్జెట్‌లో ఈ వరాన్ని జైట్లీ ప్రకటించారు. భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు మినహాయింపును ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం గతంలో జైట్లీని కోరింది. ఈ కోరిక మేరకు ఆయన ఈ వరాన్ని ప్రకటించారు. ఈ ఒక్క విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వ కోర్కెను ఆయన మన్నించినట్టయింది. 
 
అయితే, విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జాతీయ విద్యాసంస్థల నిర్మాణం, పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు నిధులు, ఇతర పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాలపై ఆయన మాటమాత్రం ప్రస్తావించక పోవడం గమనార్హం.