గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2017-18
Written By pnr
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (13:07 IST)

వేతన జీవులపై కరుణ చూపని జైట్లీ : రూ.2.5 లక్షల వరకు నిల్... రూ.5 లక్షలలోపు 5 శాతం ట్యాక్స్

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 వార్షిక బడ్జెట్‌ను బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వేతన జీవులకు పాక్షిక ఊరట కల్పించారు. ముఖ్యంగా 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింప

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 వార్షిక బడ్జెట్‌ను బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వేతన జీవులకు పాక్షిక ఊరట కల్పించారు. ముఖ్యంగా 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇచ్చారు. కానీ, 2.5 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం ఉన్నవారికి ప్రస్తుతం ఉన్న 10 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు. అలాగే, రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నవారికి 15 శాతం సర్ చార్జీ కొనసాగుతుందని ప్రకటించారు. 
 
అంతేకాకుండా, దేశంలో వ్యక్తిగతంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారి సంఖ్య 1.74 కోట్లుగా ఉందని తెలిపారు. దేశంలో 50 లక్షలకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నామని చెప్పిన వారి సంఖ్య 1.72 లక్షలు మాత్రమేని, దేశంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న కంపెనీలు 5.97 లక్షలుగా ఉందన్నారు. రూ.2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నారు 1.95 లక్షల మంది ఉండగా, రూ.10 లక్షల ఆదాయం చూపిస్తున్నవారి సంఖ్య 20 లక్షల లోపే, రూ.2.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారు 99 లక్షల మంది, 24 లక్షల మంది రూ.10 లక్షలపై ఆదాయాన్ని చూపిస్తున్నారవి వివరించారు. 
 
1.2 లక్షల మంది రూ.50 లక్షల ఆదాయాన్ని చూపిస్తున్నారు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నవారి సంఖ్య రూ.1.81 కోట్లు, 4.2 కోట్ల మంది వేతన సిబ్బంది ఉన్నారు, నోట్ల రద్దు తర్వాత పన్నుల రాబడి 34 శాతం పెరిగిందని తెలిపారు. అంతేకాకుండా, ఒక వ్యక్తి లేదా సంస్థ నుంచి రాజకీయ పార్టీలు నగదు విరాళాలు గరిష్టంగా రూ.2 వేల విరాళం మాత్రమే తీసుకోవాలన్నారు. 
 
రాజకీయ పార్టీల విరాళాలు చెక్కు లేదా డిజిటల్ రూపంలోనే చెల్లించాలని, రాజకీయ పార్టీల విరాళాలు రూ.20 వేలకు మించితే లెక్కలు చూపాలని పేర్కొన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ జారీ చేసేలా ఆర్బీఐ చట్టానికి సవరణ, ఆదాయ పన్ను చట్టం ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు పన్ను రిటర్నులు దాఖలు చేయాలని జైట్లీ ప్రకటించారు.