శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (15:01 IST)

ఆధార్‌ను కొత్త బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయాల్సిందే: ఆర్బీఐ

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు ఆధార్‌ను బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్, పాన్ కార్డులను కచ్చితంగా అనుసంధానించాల్సిందేనని ఆ

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు ఆధార్‌ను బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్, పాన్ కార్డులను కచ్చితంగా అనుసంధానించాల్సిందేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానికి సంబంధించి సుప్రీం కోర్టు నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
 
కానీ తాజాగా ఆర్బీఐ ఆధార్‌ను అనుసంధానించాల్సిందేనని తేల్చి చెప్పింది. కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచేవారు ఆధార్ వివరాలను సమర్పించాల్సిందేనని తెలిపింది. ఒకవేళ ఆధార్, పాన్ కార్డు లేకపోతే.. చిన్న మొత్తాల ఖాతాను తెరిచే సౌలభ్యాన్ని కల్పించింది.
 
కేవలం కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్)తో అనుసంధానమైన బ్యాంకుల్లోనే ఆయా ఖాతాలను తెరిచే వెసులుబాటును కల్పించింది. ఇలాంటి ఖాతాలపై కఠినమైన నిబంధనలను విధించింది. ఈ ఖాతాలను తెరిచేందుకు ఆధార్, పాన్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.