బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (10:52 IST)

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ స్కామ్... బ్యాంకులకు రూ.6 వేల కోట్ల పంగనామం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్కామ్ ఒకటి వెలుగు చూసింది. బ్యాంకులకు ఏకంగా ఆరు వేల కోట్ల మేరకు ఓ కంపెనీ పంగనామం పెట్టింది. ఆ కంపెనీ పేరు ది ఇండియన్ టెక్నోమ్యాక్. ఈ కంపెనీ 6000 కోట్ల రూపాయల కుంభకోణాన

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్కామ్ ఒకటి వెలుగు చూసింది. బ్యాంకులకు ఏకంగా ఆరు వేల కోట్ల మేరకు ఓ కంపెనీ పంగనామం పెట్టింది. ఆ కంపెనీ పేరు ది ఇండియన్ టెక్నోమ్యాక్. ఈ కంపెనీ 6000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసింది. 
 
ఎఫ్ఐఆర్‌లో ది ఇండియన్‌ టెక్నోమాక్‌ కంపెనీ 2,175 కోట్ల రూపాయల పన్నుతో పాటు మరొక 2167 కోట్ల రూపాయల రుణాలను ఎగవేసిందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. దాంతో పాటు మరో 20 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నాయని పేర్కొంది. 
 
ఇలా మొత్తం 6,000 కోట్ల రూపాయలను వివిధ బ్యాంకులకు ఎగవేసినట్టు పేర్కొంటూ ఆ కంపెనీ ఛైర్మన్‌ రాకేష్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, రంజన్‌ మోహన్‌, అశ్విన్‌ సాహూలపై కేసులు నమోదు చేసింది. వీరంతా కలిసి దాదాపు 16 బ్యాంకులకు ఎగనామం పెట్టినట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. 
 
కాగా, ఇటీవలే సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నిరవ్ మోడీ, రొటొమాక్ పెన్నుల తయారీ కంపెనీ అధినేత విక్రమ్ కొథారీలు కూడా ఇదే తరహాలో మోసాలకు పాల్పడిన విషయం తెల్సిందే. వీరిలో నిరవ్ మోడీ విదేశాలకు పారిపోగా, విక్రమ్ కొథారిని సీబీఐ అరెస్టు చేసింది.