గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (09:09 IST)

పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ స్కామ్... రూ.కోట్లు గోల్‌మాల్

దేశంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పి.ఎన్.బి)లో ఏకంగా రూ.11,346 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయి. సరైన లెక్కా పత్రాలు లేకుండా బ్యాంకు సిబ్బంది, అధికారులతో కుమ్మక్కైన ప్రముఖ జు

దేశంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పి.ఎన్.బి)లో ఏకంగా రూ.11,346 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయి. సరైన లెక్కా పత్రాలు లేకుండా బ్యాంకు సిబ్బంది, అధికారులతో కుమ్మక్కైన ప్రముఖ జువెలరీ డిజైనర్‌ నీరవ్‌ మోడీ, అతడి అనుచరులు కొందరు ఈ మొత్తాన్ని కొలగొట్టారు. 
 
విదేశాల్లోని సరఫరాదారులకు చెల్లించేందుకు బ్యాంకుల్లో పైసా కూడా నగదు డిపాజిట్‌ చేయకుండా వీరు అక్రమంగా లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ (ఎల్‌ఒయు) పొంది రూ.11,346 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్టు పీఎన్‌బి ఆడిటింగ్ విభాగం గుర్తించింది. ఈ వ్యవహారం 2011 నుంచి బ్యాంకు సిబ్బంది సహకారంతో జరుగుతూ వచ్చింది. 
 
ఈ విషయాన్ని సిబిఐకి ఫిర్యాదు చేసినట్టు పిఎన్‌బి స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు తెలిపింది. ఈ కుంభకోణానికి బాధ్యులను చేస్తూ బ్యాంక్‌ శాఖ డిప్యూటీ మేనేజర్‌తో సహా 10 మంది ఉద్యోగులపై పిఎన్‌బి వేటు వేసింది. అలాగే, నీరవ్ మోడీ మోసాలపై సిబిఐకి పిఎన్‌బి ఫిర్యాదు చేయడం గత 10 రోజుల్లో ఇది రెండోసారి.