గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (09:41 IST)

ఎయిర్‌ ఏషియా బంపర్ ఆఫర్.. రూ.99లకే ఫ్లైట్ జర్నీ

మలేషియాకు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా (ఇండియా) బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది డొమెస్టిక్ వన్ వే టిక్కెట్ బేస్ రేటును రూ.99గా, విదేశాలకు రూ.444గా నిర్ణయించింది.

మలేషియాకు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా (ఇండియా) బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది డొమెస్టిక్ వన్ వే టిక్కెట్ బేస్ రేటును రూ.99గా, విదేశాలకు రూ.444గా నిర్ణయించింది. ఈ పరిమితకాల ఆఫర్ టిక్కెట్ల బుకింగ్ ఆదివారం రాత్రి ప్రారంభమై ఈనెల 19వ తేదీతో ముగుస్తుంది. ఈ ఆఫర్‌లో బుక్ చేసుకున్న టిక్కెట్ల ద్వారా వచ్చే యేడాది మే నుంచి జనవరి 2019 మధ్యకాలంలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. 
 
ఈ ఆఫర్ టిక్కెట్లను సంస్థ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారానే బుక్ చేసుకునే వెసులుబాటువుంది. అయితే, ఈ ఆఫర్ కింద బేస్ రేటుతోపాటు అదనపు చార్జీలు, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, విమాన టిక్కెట్ ధరలో ఇంధన సర్‌చార్జీ, ఎయిర్‌పోర్టు ఫీజు, పన్నులు, ఇతర చార్జీలను ప్రయాణికుడు భరించాల్సిఉంటుంది. 
 
ఈ ఆఫర్‌లో బుక్ చేసుకున్న టిక్కెట్ల ద్వారా ఎయిర్‌ఏషియా జాయింట్ వెంచర్ సంస్థలకు చెందిన ఏ విమానాల ద్వారానైనా ప్రయాణించవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. దేశీయ మార్గాల్లో హైదరాబాద్, బెంగళూరు, కొచి, రాంచీ, భువనేశ్వర్, కోల్‌కతా, ఢిల్లీ, గోవా ఇంకా పలు మార్గాల్లో ఈ ఆఫర్ వర్తించనుంది.