శ్రీసిటీలోని ఆల్‌స్టోమ్ పరిశ్రమ 500 మైలురాయికి చేరుకుంది
స్థిరమైన, స్మార్ట్ మొబిలిటీలో నాయకునిగా కొనసాగుతున్న ఆల్‌స్టోమ్ భారతదేశంలో నేడు మరొక మైలురాయిని చేరుకుంది. అర్బన్ మెట్రో ప్రాజెక్టుల కోసం రోలింగ్ స్టాక్(మెట్రో ట్రైన్లు)ను తయారుచేసే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ఫ్యాక్టరీ, తన 500వ మెట్రో కారు ఉత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అతి పెద్ద అర్బన్ రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రంగా, ఇక్కడి పరిశ్రమ భారతీయ నగరాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నగరాలైన - చెన్నై, కొచ్చి, లక్నో, ముంబై, సిడ్నీ మరియు మాంట్రియల్‌లకు కూడా మెట్రో ట్రైన్ సెట్లను పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడి పరిశ్రమలో తయారైన మెట్రో రైళ్లు 27 మిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి.
అత్యాధునిక ఉత్పాదక ప్రమాణాలకు గుర్తింపు దక్కించుకున్న ఆల్‌స్టోమ్ శ్రీసిటీ పరిశ్రమ చెన్నై మెట్రో కోసం తన కార్యకలాపాలను సెప్టెంబర్ 2012లో ప్రారంభించింది. ఇప్పటి వరకు, ఈ సైట్‌లో 2 మిలియన్ ఉత్పాదన మరియు టెస్టింగ్ గంటలు పూర్తయ్యాయి మరియు ఏటా 480 మెట్రో కార్ల నిర్మాణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇటీవల, భారతదేశంలో అన్‌లాక్ 1.0 ప్రకటించిన అనంతరం, ఈ సైట్ కెనడాలోని నగరమైన మాంట్రియల్ (రిసో ఎక్స్‌ప్రెస్ మెట్రోపాలిటన్) కోసం రెండు ట్రైన్ సెట్లతో మొదటి బ్యాచ్‌ను విజయవంతంగా పంపించింది.
ప్రస్తుతం, ఈ సైట్‌లో ముంబై మెట్రో ఎల్3 (ఆక్వా లైన్), మాంట్రియల్ మెట్రో – రిసో ఎక్స్‌ప్రెస్ మెట్రోపాలిటన్ మరియు సిడ్నీ మెట్రో (సిటీ మరియు నైరుతి ఎక్స్‌టెన్షన్) కోసం ట్రైన్ సెట్లను తయారు చేస్తోంది. ఈ పరిశ్రమలో పర్యవేక్షకులు, ప్లానర్లు, షాప్ ఫ్లోర్ ఇంజనీర్లు తదితర విభాగాల్లోని ఉద్యోగుల్లో 15% పైచిలుకు మహిళా ఉద్యోగులు ఉన్నారు.
ఈ మైలురాయిని చేరుకోవడం గురించి ఆల్‌స్టోమ్ ఇండియా మరియు దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ అలైన్ స్ఫోర్ మాట్లాడుతూ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో ఉత్పాదకతకు అంతరాయం కలిగించినప్పటికీ, మా బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తూ, మెట్రో కార్పొరేషన్లకు కావలసిన ఉత్పత్తులను సకాలంలో అందిస్తూ, వివిధ నగరాల్లో అర్బన్ మొబిలిటీని ఉన్నతీకరిస్తున్నాము. ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందించేలా, అత్యధిక భద్రత ప్రమాణాలను కలిగిన ట్రైయిన్ సెట్లను మేము తయారు చేస్తున్నాము. మేక్-ఇన్-ఇండియాకు అనుగుణంగా, మా నిబద్ధతను కొనసాగిస్తున్నాము మరియు అన్ని దేశీయ ప్రాజెక్టులలో లోకలైజేషన్ 75% పైగా ఉందని వివరించారు.
భారతదేశంలో ఆల్‌స్టోమ్ అడుగు జాడలు వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది- బెంగళూరులోని ఇన్నోవేషన్ సెంటర్‌లో ఇంజనీరింగ్ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, మాధేపురా యూనిట్‌లో ఎలక్ట్రిక్ లోకో మోటివ్స్ (eLoco), కోయంబత్తూర్‌లో రైల్ కాంపోనెంట్స్ మరియు కోల్‌కతాలోని ఇ-లోకో కార్ బాడీ షెల్ ఉత్పత్తిపై దృష్టి సారించింది.