గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 జనవరి 2024 (17:59 IST)

జనవరి 13-18, 2024 వరకు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్

Amazon
జనవరి 13 నుండి జనవరి 18, 2024 వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ని అమేజాన్ ఇండియా ప్రకటించింది, ప్రైమ్ మెంబర్‌లకు జనవరి 13వ తేదీ ఉదయం 12:00 నుండి 11:59 వరకు 12 గంటలు ముందుగా యాక్సెస్ లభిస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌లు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, కిరాణా, ఫ్యాషన్-బ్యూటీ అవసరాలు, హోమ్-కిచెన్, పెద్ద ఉపకరణాలు, వంటి శ్రేణుల్లో కళాకారులు-నేత కార్మికులు, మహిళా వ్యాపారవేత్తలు, స్టార్టప్‌లు, బ్రాండ్‌లు, టీవీలు మరిన్నింటిని  స్థానిక పొరుగు దుకాణాలతో సహా విక్రేతలు అందించే మిలియన్ల కొద్దీ ఉత్పత్తుల నుండి కస్టమర్‌లు షాపింగ్ చేయవచ్చు.
 
పండుగ వేడుకల్లో భాగంగా అమెజాన్ రెడ్మీ నోట్ 13 5G యొక్క సహ మద్దతుతో 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'ని ప్రకటించింది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా, కస్టమర్‌లు రెడ్‌మీ స్మార్ట్‌ ఫోన్‌లు, ఇంటెల్ ల్యాప్‌టాప్‌లు, క్యాడ్‌బరీస్, లాక్మే, లోరియల్, ప్యాంపర్స్, డోవ్, వాసెలిన్, గార్నియర్, మేబిలైన్, టీసీఎల్-శామ్ సంగ్ నుండి టెలివిజన్‌లు, పెద్ద ఉపకరణాలు వంటి బ్రాండ్‌ల నుండి ఎల్జీ నుండి పెద్ద ఉపకరణాలు నుండి గొప్ప విలువైన ఆఫర్‌ల కోసం ఎదురుచూడవచ్చు.
 
అమేజాన్ లైవ్‌తో వినోదంగా షాపింగ్ చేయండి: రణ్ విజయ్, వినీత్ మల్హోత్రా, రాజీవ్ మఖ్నీ, టెక్నో రుహెజ్, ట్రాకిన్ టెక్ వంటి ప్రముఖులు, సాంకేతిక ఔత్సాహికులతో డీల్‌లను కనుగొనండి మరియు మీ కొనుగోళ్ల గురించి సమాచారం తీసుకోవడానికి వారితో చాట్ చేయండి.
 
ప్రతి ఒక్కరి కోసం గొప్ప ఆదాలు
అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో షాపింగ్ చేసే కస్టమర్స్ ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, అమేజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, అమేజాన్ పే లేటర్, ఎంపిక చేయబడిన డెబిట్ & క్రెడిట్ కార్డ్స్‌తో అదనంగా 10% తక్షణ డిస్కౌంట్‌ను ఆనందించవచ్చు.
 
అమేజాన్ పేతో మరిన్ని రివార్డ్స్ సంపాదించండి: అమేజాన్ పే ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేసే కస్టమర్స్ అన్‌లిమిటెడ్ 5% క్యాష్‌బ్యాక్ పొందుతారు. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో షాపింగ్ చేసేటప్పుడు రూ. 5,000 వరకు రివార్డ్స్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఆఫర్స్‌ను క్యాష్‌బ్యాక్ పొందడానికి అమేజాన్ పేని ఉపయోగించి షాపింగ్ చేయడం, బిల్లులు చెల్లించడం, ఫోన్ రీఛార్జ్ చేయడం మరియు డబ్బుని జోడించడం లేదా పంపడం మాత్రమే వారు చేయాల్సి ఉంటుంది.