సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 నవంబరు 2023 (18:44 IST)

పుష్ప-2 కోసం అమేజాన్ వెనక్కి తగ్గింది..

Pushpa: The Rise
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో సంస్థ ఈ భారీ డీల్ కుదుర్చుకుంది. 
 
హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్‌తో పోటీపడింది. నిర్మాతలు భారీగా డిమాండ్ చేయడంతో అమెజాన్ ప్రైమ్ వెనక్కి తగ్గింది. 
 
2021లో వచ్చిన పుష్ప1 హక్కులను అమెజాన్ రూ.30 కోట్లకు దక్కించుకుంది. తాజాగా వస్తున్న సీక్వెల్ అంతకు మూడు రెట్లు అధికంగా నెట్ ఫ్లిక్స్ చెల్లించింది. 
 
సుమారు రూ.100 కోట్లకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.