మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 9 ఫిబ్రవరి 2023 (18:02 IST)

ప్రతిష్టాత్మకమైన హైసియా అవార్డు 2023 అందుకున్న అన్వయా కిన్‌ కేర్‌, ఎస్లాబ్లిష్డ్‌ విభాగంలో బెస్ట్‌ ప్రొడక్ట్‌గా గుర్తింపు

image
భారతదేశంలో సుప్రసిద్ధ, ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ), ఐఓటీ ఆధారిత, సమగ్రమైన, వ్యక్తిగతీకరించిన ఒన్‌ స్టాప్‌ సీనియర్‌ కేర్‌ ప్లాట్‌ఫామ్‌ అన్వయా కిన్‌ కేర్‌ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసొసియేషన్‌ (హైసియా) అవార్డును అందుకుంది. ఇంటి వద్దనే డెమిన్టియా కేర్‌, ఐఓటీ ఆధారిత ప్రోయాక్టివ్‌ స్మార్ట్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సొల్యూషన్స్‌ కోసం బెస్ట్‌ ప్రొడక్ట్‌- ఎస్లాబ్లిష్డ్‌ కేటగిరీలో ఈ అవార్డు అందజేశారు.
 
ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలో తెలంగాణా ఐటీ శాఖామాత్యులు కెటీ రామారావు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ సీఈఓ- మేనేజింగ్‌ డైరెక్టర్‌ దేబాషిస్‌ ఛటర్జీ, సైయెంట్‌ ఫౌండర్‌ ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి, హైసియా మేనేజ్‌మెంట్‌ పాల్గొన్నారు.
 
image
అన్వయాకిన్‌ కేర్‌ ఫౌండర్‌, డైరెక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘‘ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడనేది తమ నిబద్ధత, మౌలిక విలువలకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ అవార్డు గెలుచుకోవడం అన్వయా వద్ద మా ప్రొఫెషనల్‌ బృందమంతటికీ గర్వకారణంగా ఉంది. వారి సహకారం లేకుండా ఈ అవార్డు సాధ్యం కాదు. అన్వయా యొక్క డెమింటియా కేర్‌ ప్లాన్‌ను డెమింటియాతో బాధపడుతున్న వ్యక్తులు (పీడబ్ల్యుడీ) కోసం రూపొందించాము. దీనికోసం ప్రత్యేకంగా డెమెంటియా సైకాలజిస్ట్‌లు, న్యూరాలజిస్ట్‌లు, సైక్రియాట్రిస్ట్‌లతో భాగస్వామ్యం చేసుకున్నాము’’ అని అన్నారు.