శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (21:06 IST)

ప్యూర్‌ ఈవీ విద్యుత్‌ మోటర్‌సైకిల్‌ జస్ట్ రూ. 99,999

EV motor cycle
సుప్రసిద్ధ విద్యుత్‌ ద్విచక్ర వాహన సంస్థ ప్యూర్‌ ఈవీ, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కమ్యూట్‌ విద్యుత్‌ మోటర్‌సైకిల్‌, ecoDryft ప్రారంభ ధరను విడుదల చేసింది. ఈ వాహనం ధర 99,999 రూపాయలుగా (ఎక్స్‌ షోరూమ్‌, ఢిల్లీ, రాష్ట్ర సబ్సిడీ కలుపుకుని) వెల్లడించింది. ఈ మోటార్‌సైకిల్ బ్లాక్, గ్రే, బ్లూ మరియు రెడ్ నాలుగు అద్భుతమైన రంగులలో లభిస్తుంది.
 
ఎకోడ్రిఫ్ట్‌ను హైదరాబాద్‌లోని ప్యూర్‌ ఈవీ యొక్క సాంకేతిక మరియు తయారీ కేంద్రం వద్ద రూపొందించి, అభివృద్ధి చేశారు. ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. మూడు డ్రైవింగ్‌ మోడ్స్‌తో 130 కిలోమీటర్ల వరకూ ఒక్కసారి చార్జింగ్‌తో ప్రయాణిస్తుంది. ఈ డ్రైవ్‌ ట్రైన్‌లో ఏఐఎస్‌ 156 సర్టిఫైడ్‌ 3.0 కిలోవాట్‌ అవర్ బ్యాటరీ, స్మార్ట్‌ బీఎంఎస్‌తో ఉంది. దీనిలో బ్లూ టూత్‌ కనెక్టివిటీ సైతం ఉండటంతో పాటుగా 3 కిలోవాట్‌ మోటర్‌, సీఏఎన్‌ ఆధారిత చార్జర్‌, కంట్రోలర్‌ మరియు ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఆధారిత సదుపాయలను కలిగి ఉండడం చేత భవిష్యత్‌లో ఫర్మ్‌వేర్‌ అప్‌గ్రేడ్స్‌ సైతం అనుమతిస్తుంది.
 
ప్యూర్‌ ఈవీ స్టార్టప్‌ సహ-వ్యవస్థాపకుడు మరియు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శ్రీ రోహిత్‌ వదేరా మాట్లాడుతూ, “గత రెండు నెలలుగా, భారతదేశ వ్యాప్తంగా 100కు పైగా వున్న మా డీలర్‌షిప్‌లన్నింటిలో డెమో వాహనాలను టెస్ట్‌ డ్రైవ్‌ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చాము, వినియోగదారుల నుంచి అపూర్వమైన స్పందననూ అందుకున్నాము, ఎకోడ్రిఫ్ట్‌ కోసం ఆయా డీలర్ల వద్ద అడ్వాన్స్ బుకింగ్స్‌ ప్రారంభించామని, మొదటి బ్యాచ్‌లో వాహనాలను మార్చి మొదటి వారం నుంచి డెలివరీ చేయనున్నాము’’ అని చెప్పారు.
 
ఎకో డ్రిఫ్ట్‌ ఆవిష్కరణ యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన ప్రస్తావిస్తూ ‘‘దేశంలో దాదాపు 65%  ద్విచక్ర వాహన అమ్మకాలు కమ్యూటర్‌ మోటర్‌సైకిల్స్‌ నుంచి వస్తున్నాయి, ఎకో డ్రిఫ్ట్‌ ఆవిష్కరణతో భారీ శ్రేణి విద్యుత్‌ వాహన స్వీకరణ సాధ్యమవుతుందని నమ్ముతున్నాము’’ అని అన్నారు. ప్రారంభోత్సవ ధర 99,999 రూపాయలు ప్రత్యేకంగా న్యూఢిల్లీకి మాత్రమే వర్తిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలలో ఎకోడ్రిఫ్ట్‌ ధరలు 1,14,999 రూపాయలుగా (ఎక్స్‌ షోరూమ్‌) ఉంటుంది. ఆన్‌ రోడ్‌ ధరలు ఆ రాష్ట్రాల రాయితీలు మరియు ఆర్‌టీఓ ఫీజులపై ఆధారపడి ఉంటాయి.