గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (13:28 IST)

ఏప్రిల్ నెలలో 9 రోజులు బ్యాంకు సెలవులు

ఏప్రిల్ నెలలో మొత్తంగా ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు 9 రోజులపాటు సెలవులను ఆర్బీఐ ప్రకటించింది. అయితే, ఈ వారంలోనే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు తెరుచుకోవడం లేదు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వివిధ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఇస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. అయితే, దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా బ్యాంకులకు ఈ నాలుగు రోజులపాటు వరుస సెలవులు ఇస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
 
ఏప్రిల్ 13వ తేదీన తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది, గుడిపడ్వా, నంగమాపంబ మొదటి నవరాత్రి, బైశాఖి సందర్భంగా బ్యాంకులకు సెలవు.. ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, తమిళ కొత్త సంవత్సరం, విషు, బిజు ఫెస్టివల్, బోహాడ్ బిహు పండుగల సందర్భంగా సెలవు వుంది.
 
ఏప్రిల్ 15వతేదీన హిమాచల్ దినోత్సవం, బెంగాల్ కొత్త సంవత్సరం, బోహాగ్ బిహు, సార్హుల్ పండుగల సందర్భంగా సెలవు.. ఏప్రిల్ 16వ తేదీన బొహాగ్ బిహు పండగ సందర్భంగా సెలవు ప్రకటించారు. అయితే, ఆ పండుగలను బట్టి.. సంబంధిత ప్రాంతాల్లో సెలవు ప్రకటించింది ఆర్బీఐ. మరోవైపు ఈ నెల 21, 24 తేదీల్లో రామనవమి, రెండో శనివారం సందర్భంగా రెండు రోజుల పాటు బ్యాంకులు తెరుచుకోవు.