గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 మే 2023 (13:27 IST)

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త - ఐదు రోజుల పనిదినాలు...

banks
బ్యాంకు ఉద్యోగులకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు శుభవార్త చెప్పాయి. తమ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనికి అనుమతించనున్నాయి. ఈ విధానానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేయనుంది. వారానికి ఐదు రోజుల పని పద్ధతిపై గతంలోనే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్స్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్‌లు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. 
 
అయితే, ఐదు రోజుల పాటు పనిదినాలు అమల్లోకి వస్తే మాత్రం రోజువారిగా వర్కింగ్ అవర్స్ (పని గంటలు) పెరుగుతాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ అదనంగా మరో 40 నిమిషాల పాటు పని చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో రెండు, నాలుగో శనివారాలు సెలవులు ఇస్తున్న విషయం తెల్సిందే. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తేలిపితే ఇకపై ప్రతి శని, ఆదివారాలు సెలవులు ఉంటాయి.