సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మే 2023 (12:55 IST)

దేశంలో కొత్తగా 3,720 కేసులు.. రికవరీ రేటు 98.73 శాతం

Corona
భారతదేశంలో కొత్తగా 3,720 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 40,177గా ఉంది. తాజాగా  డేటా ప్రకారం... కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,584కి పెరిగింది. 
 
వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,43,84,955కు పెరిగింది. కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.09గా శాతం ఉన్నాయి. 
 
అయితే జాతీయ COVID-19 రికవరీ రేటు 98.73 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లు అందించడం జరిగాయి.