శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (09:49 IST)

పేటీఎం క్యాష్ బ్యాష్‌ను నమ్మి.. రూ.95వేలు కోల్పోయిన వ్యక్తి

PAYTM
పేటీఎం క్యాష్ బ్యాష్‌ను నమ్మి బెంగళూరు వ్యక్తి మోసపోయాడు. బెంగళూరు హోసపాళ్య ప్రాంతంలోని మసాలా దినుసుల దుకాణం యజమాని సురేష్ ఎం అనే 49 ఏళ్ల వ్యక్తి తనకు రూ. 95,000లను పోగొట్టుకున్నాడు. 
 
డిజిటల్ చెల్లింపు యాప్‌లో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను యాక్టివేట్ చేసే నెపంతో తన ఫోన్‌ను హ్యాక్ చేశాడని సురేష్ తెలిపాడు. రెండు గంటల్లో యాక్టివేట్ అవుతుందని చెప్పి వెళ్లిపోయాడు.

కొంత సమయం తర్వాత, నా ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదని గమనించాను.నేను ఫోన్‌ని దగ్గర్లోని మొబైల్ సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లాను. మొబైల్ డేటా ఆన్ చేయగానే సురేష్‌‌ ఖాతా నుంచి రూ.95వేల డెబిట్ అయ్యిందని.. అప్పుడే మోసపోయానని వెల్లడించాడు.