2జీ రోమింగ్‌పై జియో, వొడాఫోన్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ చర్చలు
భారత ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2జీ రోమింగ్‌పై రిలయన్స్ జియో, వొడాఫోన్‌తో ఒప్పందం చేసుకునేందుకు చర్చలు చేపట్టారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఛైర్మన్, ఎండీ అనుపమ్ శ్రీవాస్తవ స్పందిస్తూ.. ఈ సంస్థల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించింది. ఈ చర్చలు 2జీ ఇంటర్ సర్కిల్ రోమింగ్ కోసం జరుపుతున్నట్టు తెలిపారు. ఈ నెలలో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ ఒప్పందం కుదిరితే రిలయన్స్ జియో, వొడాఫోన్ కస్టమర్లు కవరేజీ లేని చోట బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు కూడా జియో, వొడాఫోన్ నెట్‌వర్క్‌లను వాడుకునే అవకాశం ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో భారీ నెట్‌వర్క్ ఉన్న విషయం తెల్సిందే.