సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 6 అక్టోబరు 2021 (16:21 IST)

మ్యాడ్ బరీ ద్వారా మిలియన్ వెర్షన్లను రూపొందించిన క్యాడ్ బరీ డెయిరీ మిల్క్ అభిమానులు

క్యాడ్ బరీ డెయిరీ మిల్క్, బోర్నవిటా, ఓరియో లాంటి భారతదేశ అభిమాన స్నాకింగ్ బ్రాండ్లను ఉత్పత్తి చేసే మాండలెజ్ ఇండియా నేడిక్కడ మ్యాడ్ బరీ క్యాంపెయిన్ మూడో ఎడిషన్ ను ప్రకటించింది. ‘కౌన్ బనేగా హమారీ అగ్లీ క్యాడ్ బరీ’ నుంచి ‘కహా సే ఆయేగీ హమారీ అగ్లీ క్యాడ్ బరీ?’ దాకా గత రెండు విజయవంతమైన సీజన్ల ద్వారా వినియోగదారులకు స్ఫూర్తినందిస్తూ వచ్చింది క్యాడ్ బరీ.
 
ఇప్పుడు ఇది క్యాడ్ బరీ యొక్క తదుపరి ‘హోమ్ వాలా’ ఫ్లేవర్ కోసం భారతదేశ యుద్ధానికి సిద్ధమవుతోంది. మ్యాడ్ బరీ 2021 నూతన సీజన్ వినియోగదారులను ‘క్యాడ్ బరీ కా నయా ఫ్లేవర్ బనావో, ఫేమస్ హోజావో’  (క్యాడ్ బరీ కొత్త ఫ్లేవర్ తయారు చేయండి, పేరుప్రఖ్యాతులు పొందండి) అంటూ ఉత్సాహపరుస్తోంది.
 
ఈ సందర్భంగా మాండలెజ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ (మార్కెటింగ్) అనిల్ విశ్వనాథన్ మాట్లా డుతూ, ‘‘గత కొన్నేళ్లుగా భారతీయ చాకొలెట్ ఉద్యమం ఊపందుకుంటోంది. భారతీయులు నూతన రుచు లు, ఫ్లేవర్లతో ప్రయోగాలు చేసేందుకు చూస్తున్న నేపథ్యంలో అసాధారణ, ప్రత్యేకమైన చాకొలెట్ ఫ్లేవర్లకు ప్రశంసలు పెరిగిపోవడాన్ని చూస్తున్నాం. 70ఏళ్లకు పైగా అంతా ఎంతగానో అభిమానిస్తున్న బ్రాండ్‌గా ఉ న్న మేం ప్రస్తుత ధోరణలు, ప్రథమ్యాల సాయం తీసుకుంటూ నిరంతరం మా వినియోగదారులతో మమే కం అయ్యేందుకు వినూత్న మార్గాల కోసం చూస్తుంటాం.
 
‘ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు’ అనే క్యాంపెయిన్‌తో మ్యాడ్ బరీ రూపొందించబడింది. ఇది అంతా కలసి ముచ్చటించుకునేందుకు ఒక అద్భుత వేదికగా మారింది. మా వినియోగదారులు తామెంతగానో అభిమానించే క్యాడ్ బరీ చాకొలెట్ కు తమ సొం త వెర్షన్ తయారు చేసే అవకాశాన్ని ఇది అందిస్తుంది. ఈ క్యాంపెయిన్ ఏటా మేం మా వినియోగదారుల తో మమేకమయ్యే, వారెంతగానో అభిమానించే బ్రాండ్‌తో అనుబంధాన్ని ప్రగాఢ స్థాయికి తీసుకెళ్లే అవకా శాన్ని అందిస్తుంది. గత రెండు ఎడిషన్లకు వచ్చిన స్పందన మమ్మల్ని ఎంతగానో ఆనందింపజేసింది.
 
మ్యా డ్ బరీ 2020 క్యాడ్ బరీ డెయిరీ మిల్క్ గులాబ్ యే ఖాస్ (గులాబీ, బాదంపప్పుల మిశ్రమం), క్యాడ్ బరీ డెయిరీ మిల్క్ చిల్లీ ఆరెంజ్ (నారింజ, మిర్చి యొక్క ఫ్రూటీ, స్పైసీ సమ్మిళితం) అనే రెండు విన్నింగ్ ఫ్లేవ ర్స్ లిమిటెడ్ ఎడిషన్ బార్స్ ను ప్రవేశపెట్టాం. వీటిని వరుసగా సుసాన్ సల్దానా (మంగళూరు), సాక్షి శ్రీవా త్సవ (లక్నో) రూపొందించారు. మ్యాడ్ బరీ 2021లో రాబోయే సృజనాత్మక ఫ్లేవర్ల కోసం మేం ఎదురు చూస్తున్నాం’’ అని అన్నారు.
 
క్యాడ్ బరీ డెయిరీ మిల్క్ యొక్క మ్యాడ్ బరీ క్యాంపెయిన్ కొనుగోలుదారులకు తాము ఎంతగానో అభిమానించే చాకొలెట్ కు ట్విస్ట్ ఇచ్చే అవకాశాన్ని అందిస్తుంది.  2019లో విజయవంతంగా ప్రవేశపెట్టిన తరువాత, 2020 ఎడిషన్ 1200 మిలియన్లకు పైగా ఇంప్రెషన్లను పొందింది. 2.3 మిలియన్ల మంది వినియోగదారులతో అనుసంధానమైంది. 5000కు పైగా లొకేషన్స్ నుంచి స్వాగతం పలుకుతూ ఎంట్రీలు వచ్చాయి.
 
దేశీ ‘హోమ్ వాలా’ క్రియేషన్స్ గా చాయ్, కుల్ఫీ, బనానా, ఫడ్జ్, సాల్టెడ్ కారామెల్ లాంటి  బాగా ప్రజాదరణ పొందిన ఫ్లేవర్లు కూడా వచ్చాయి. షెఫ్ కునాల్ కపూర్, నిపుణుల బృందం విస్తృత షార్ట్ లిస్టింగ్ ప్రక్రియ అనంతరం వినియోగదారులు అంతిమంగా రెండు ఫ్లేవర్లను ఎంచుకున్నారు. విజేతలుగా నిలిచిన ఫ్లేవర్లకు డిజిటల్ ఫిల్మ్ లు, అవుట్ డోర్, ప్రింట్ మాధ్యమాల ద్వారా ప్రాచుర్యం కల్పించబడుతుంది. లిమిటెడ్ ఎడిషన్ బార్స్ ఇప్పటికే దుకాణాలకు, ఇ-కామర్స్ చానల్స్ కు చేరుకున్నాయి. 
 
మ్యాడ్ బరీ మూడో ఎడిషన్ గత రెండు ఎడిషన్ల కన్నా భారీ స్థాయిలో జరుగనుంది. సృజనాత్మక తకు వీలుగా 25% మరింతగా దినుసులు జోడించబడుతాయి. మ్యాడ్ బరీ 2021 ను వినియోగదారులకు మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, మ్యాడ్ బరీ వెబ్ సైట్, జియో ఎంగేజ్ లకు తోడుగా మరో రెండు కొత్త వేదికలు రానున్నాయి. వాట్సాప్ మరియు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్. వినియోగదారులుతమ ఎంట్రీలను సెప్టెంబర్ నుంచి నవంబర్ దాకా సమర్పించవచ్చు. విజేతలను 2022 ఆగస్టులో ప్రకటిస్తారు.