సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (09:58 IST)

పండగ సీజన్‌లో మహిళలకు చేదువార్తం.. పసిడి ధరలు పైపైకి

పండగ సీజన్‌లో మహిళలకు ఇది నిజంగానే చేదువార్త. గత మూడు రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో ఒడిదుడుకులు కనిపిస్తుంటాయి.
 
అయితే, బుధవారం (అక్టోబర్‌ 6) దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.250 నుంచి 400 వరకు పెరిగింది. ఆయా నగరాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
 
ఈ లెక్కల దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,080 ఉంది. 
 
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,680 ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,850 ఉంది.
 
హైదరాబాద్‌ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది.