ఉడాన్ కెప్టెన్ హార్వెస్ట్ శ్రేణి నాణ్యమైన, అందుబాటు ధరలలోని ఆహార పదార్థాలు
భారతదేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) ఈ కామర్స్ వేదిక ఉడాన్ నేడు అసంఘటిత రంగంలోని భారీ ఆహార ఉత్పత్తుల మార్కెట్‌లో కెప్టెన్ హార్వెస్ట్ బ్రాండ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా కెప్టెన్ హార్వెస్ట్ బ్రాండ్ నాణ్యమైన, సరసమైన ధరలలోని ఆటా, మైదా, గోధుమలు, బియ్యం, శెనగపిండి తదితర ఉత్పత్తులు ప్రత్యేకంగా ఉడాన్ వేదికపై లభ్యం కానున్నాయి.
ఈ సందర్భంగా ఉడాన్ హెడ్- ఫుడ్ బిజినెస్, వివేక్ గుప్తా మాట్లాడుతూ, కిరాణా స్టోర్లు నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నాణ్యమైన, సరసమైన ధరలలో ఉత్పత్తులను అసంఘటిత రంగంలోని మార్కెట్‌లలో పొందలేకపోవడం. ఈ ఫలితంగా స్థానిక రిటైలర్లు విక్రేతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. దీనికితోడు లభ్యతననుసరించి ధరలు కూడా హెచ్చుతగ్గుదలకు లోనవుతుంటాయి. ఈ సమస్యలకు కెప్టెన్ హార్వెస్ట్ తగిన పరిష్కారం చూపగలదు. అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను సరసమైన ధరలలో అందిస్తుంది. అంతేకాదు, రైతులు, చిన్న మిల్లర్లు సైతం ఇ-కామర్స్ వ్యాప్తి ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు అని అన్నారు.
రైతుల నుంచి నేరుగా సేకరించడంతో పాటుగా అత్యంత శుభ్రమైన వాతావరణంలో ప్యాకింగ్ చేస్తోన్న కెప్టెన్ హార్వెస్ట్ శ్రేణి ఆహారోత్పత్తులు బహుళ ఎస్‌కెయులలో లభిస్తున్నాయి. ఈ బ్రాండ్ తొలుత 40 నగరాలు, పట్టణాలలో లభ్యం కానుంది. అనంతర కాలంలో ఇతర పట్టణాలకు వ్యాప్తి చెందనుంది.