శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (16:16 IST)

బ్యాంకుల్లో విత్‌డ్రా పరిమితి పెంపు.. మార్చి 13 నుంచి అమల్లోకి

భారత రిజర్వు బ్యాంకుల్ నగదు విత్‌డ్రాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో ఈనెల 20వ తేదీ నుంచి బ్యాంకు ఖాతాల నుంచి ఏక కాలంలో రూ.50 వేల వరకు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు లభించింది. మార్చి 13 నుంచి సేవి

భారత రిజర్వు బ్యాంకుల్ నగదు విత్‌డ్రాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో ఈనెల 20వ తేదీ నుంచి బ్యాంకు ఖాతాల నుంచి ఏక కాలంలో రూ.50 వేల వరకు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు లభించింది. మార్చి 13 నుంచి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ల నుంచి నగుదు విత్‌డ్రా పరిమితులు ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. దీంతో రోజువారి, వీక్లీ విత్‌డ్రాలపై ఉన్నపరిమితులు ఎత్తివేసినట్టు అవుతుంది. 
 
రెండు విడతల్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లను రిలాక్స్ చేయనున్నారు. ఫిబ్రవరి 20 నుంచి విత్‌డ్రా పరిమితి రూ.24 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నారు. మార్చి 13 నుంచి పూర్తిగా పరిమితులు ఎత్తివేస్తారు. దీంతో నోట్లరద్దు తర్వాత విధించిన ఆంక్షలు పూర్తిగా తొలిగి యధాపూర్వ పరిస్థితి ఏర్పడుతుంది.
 
కాగా, పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌ర్వాత న‌గ‌దు కొర‌త‌తో ఇబ్బందులు ప‌డుతున్న బ్యాంకు ఖాతాదారుల‌కు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త‌నందించింది. రెండు ద‌శ‌ల‌లో న‌గ‌దు విత్ డ్రా ప‌రిమితిని క్రమంగా ఎత్తివేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.