శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2016 (14:39 IST)

ఆ బంగళా ఖరీదు రూ.435 కోట్లు.. కొనుగోలు చేసింది ఎవరో తెలుసా?

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తిరోగమనంలో పయనిస్తోందంటూ పలువురు నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, వీరి అభిప్రాయం తప్పని తెలుస్తోంది. ఎందుకంటే.. న్యూఢిల్లీలో ఓ రియల్టర

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తిరోగమనంలో పయనిస్తోందంటూ పలువురు నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, వీరి అభిప్రాయం తప్పని తెలుస్తోంది. ఎందుకంటే.. న్యూఢిల్లీలో ఓ రియల్టర్ కుమార్తె ఏకంగా రూ.435 కోట్లు వెచ్చించి బంగళాను కొనుగోలు చేసింది. ఈ భవనం హస్తినాపురంలోని పృథ్వీరాజ్ రోడ్డులో ఉంది. 
 
ఆ రియల్టర్ ఎవరో కాదు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్‌ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్. ఈయన కుమార్తె రేణుక తల్వార్. ఈమె బంగ్లాను కమల్ తనేజా నుంచి కొనుగోలు చేశారు. మొత్తం 4,925 చదరపుటడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాంతం ఉంది. ఇందులో 1,189 చ.మీ. బంగళాను నిర్మించారు. ఒక్కో చ.మీ.కి రూ.8.8 లక్షల చొప్పున ధర చెల్లించి బంగళాను కొనుగోలు చేశారు. 
 
ప్రస్తుతమున్న విలువ ప్రకారం 1,189 మీటర్లలో ఉన్న ఒక్క బంగ్లా ధర రూ.383 కోట్లు పలికింది. లటీన్స్ బంగ్లా జోన్‌లో రేణుక ఈ భవంతిని కొన్నారు. ఢిల్లీలో ప్రముఖులు నివాసముండే భవంతుల సముదాయం ఈ ప్రాంతం. దాదాపు 3 వేల ఎకరాల్లో, వెయ్యి బంగళాలతో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే నివాసముంటుంటారు.