గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 మే 2023 (13:52 IST)

సామాన్యులకు శుభవార్త - తగ్గనున్న వంట నూనె ధరలు

Oils
సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా వంట నూనెలు ధరలు తగ్గుతాయని వెల్లడించింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు దేశంలో విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి ధరలు తగ్గినప్పటికీ దేశీయంగా మాత్రం ధరలు తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఈ ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా వీటి ధరలు తగ్గనున్నాయి. 
 
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌ రేట్ల తగ్గుదలకు అనుగుమంగా దేశీయ మార్కెట్‌లో కూడా వంట నూనె ధరలను తగ్గించాలని ఆయిల్ ఉత్పత్తి కంపెనీలను ఆదేశించింది. దీంతో మన దేశంలో వంట నూనె విక్రయించే కంపెనీలు ఆయిల్ ధరలను తగ్గించాలని నిర్ణయించారు. వంట నూనె ధరను ఏకంగా 6 శాతం తగ్గించే అవకాశం ఉంది. కేంద్రం ఆదేశాలతో ఆయిల్ కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు ఎంతో ఊరట కలిగించనుంది. 
 
ఫార్చూన్ బ్రాండ్ కింద వంట నూనెలు విక్రయించే అదానీ విల్‌మర్, జెమిని బ్రాండ్ కింద వంట నూనె అమ్ముతున్ జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా కంపెనీలు వంట నూనె ధరలను వరుసగా లీటరుకు 5 నుంచి 10 రూపాయల మేరకు తగ్గించాలని నిర్ణయించాయి.