బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 మే 2017 (15:31 IST)

ఆదివారం ఇక పెట్రోల్ బంకుల బంద్.. అత్యవసర పరిస్థితుల్లో.. ఒక్కరు మాత్రమే?

పెట్రోల్ బంకులకు కూడా ఇకపై వీకెండ్ సెలవులు ఖాయం కానున్నాయి. మే నెల 14 (ఆదివారం) నుంచి పెట్రోల్ బంక్‌లను బంద్ చేయనున్నారు. తద్వారా ఇకపై ఆదివారాల్లో మీ వాహనాలకు ఆయిల్ నింపుకోవడం కుదరదు. ఆంధ్రప్రదేశ్, మహ

పెట్రోల్ బంకులకు కూడా ఇకపై వీకెండ్ సెలవులు ఖాయం కానున్నాయి. మే నెల 14 (ఆదివారం) నుంచి పెట్రోల్ బంక్‌లను బంద్ చేయనున్నారు. తద్వారా ఇకపై ఆదివారాల్లో మీ వాహనాలకు ఆయిల్ నింపుకోవడం కుదరదు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి వంటి 8 రాష్ట్రాల్లో 20 వేల పెట్రోల్ బంక్‌లు ఇకపై ఆదివారం నాడు మూతపడనున్నాయి.

మామూలు  పనిదినాల్లో పెట్రోల్ బంకుల్లో 15 మంది సిబ్బంది వరకు పనిచేస్తారు. ఇకపై ఆదివారం అత్యవసర పరిస్థితుల్లో ఉండే.. వాహనాలకు మాత్రమే పెట్రోల్ అందించేందుకు బంకుల్లో ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉంటారు.
 
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విజ్ఞప్తి చేయడంలో.. ఆదివారం బందును ఇన్నాళ్లు అమలు చేయలేదని ఇండియన్ పెట్రోలియం డీలర్స్ ఎక్స్‌క్యూటివ్ కమిటీ సభ్యుడు సురేశ్ కుమార్ చెప్పారు. ప్రధాని ఇటీవల చేసిన మన్ కీ బాత్ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణకు ఇంధన ఆదా పాటించాలన్న వ్యాఖ్యలను సైతం పరిగణనలోకి తీసుకుని మే 14నుంచి ఈ ఆదివారం మూసివేత విధానం అమలు చేస్తున్నామని సురేశ్  కుమార్ వెల్లడించారు.