వంటనూనెల ఉత్పత్తిలో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు గెలుచుకున్న గోల్డ్‌డ్రాప్
వంటనూనెల పరిశ్రమలో ప్రముఖ సంస్ధ గోల్డ్‌డ్రాప్, మరోమారు ప్రతిష్టాత్మకమైన కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ (సీఐటీడీ) అవార్డును అందుకుంది. నాణ్యత, భద్రత పట్ల సర్వోన్నత ప్రమాణాలను అందుకున్నందుకు గోల్డ్‌డ్రాప్‌కు ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డును గోల్డ్‌డ్రాప్ గెలుచుకోవడం ఏడవసారి. అత్యున్నత నాణ్యత, పరిశుభ్రత, పోషకాల పరంగా అత్యున్నత వంట నూనెగా గోల్డ్‌డ్రాప్ నిబద్ధతను ఈ అవార్డు గుర్తిస్తుంది.
తెలంగాణా రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదగా గోల్డ్‌డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మితేష్ లోహియా మాట్లాడుతూ, "మరోమారు ఈ అవార్డు అందుకోవడం నాణ్యత, ఆవిష్కరణ పట్ల మా అవిశ్రాంత ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తుంది.మా వినియోగదారులకు అత్యుత్తమమైనది అందించేందుకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను అనుసరిస్తున్నాము. చాలాచాలా లైట్ ఆల్వేస్ యాక్టివ్' అనే వాగ్ధానాన్ని గోల్డ్ డ్రాప్ నేరవేరుస్తూ స్వచ్ఛత, రుచి, పోషకాలను అందిస్తుంది అని అన్నారు.