గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (13:28 IST)

బంగారం ధర దిగొచ్చేసింది... కొనుగోలు చేసేవారికి ఛాన్స్...

బంగారం ధరలు రెండోరోజు కూడా తగ్గాయి. గ్లోబల్ వాణిజ్యంలోని వచ్చిన తేడాల వల్ల బంగారం ధరలపై ప్రభావం చూపి ధరలు తగ్గినట్లు నిపుణులు చెపుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాదులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 మేరకు తగ్గింది. ఫలితంగా రూ.39,230 నుంచి రూ.39,110 మేరకు బంగారం ధరలు క్షీణించాయి.
 
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.90 తగ్గుదలతో రూ.42,760 నుంచి రూ.42,670కు మేరకు పడిపోయింది. బంగారం ధరలు ఇలా వుంటే వెండి ధర ఏకంగా రూ.990 పతనమై రూ.49,990 నుంచి రూ.49,000కు పడిపోయింది.