రాకెట్‌లా దూసుకుపోతున్న బంగారం ధరలు... ఇరాన్-అమెరికాలే కారణమా?
బంగారం ధర చుక్కలు చూపిస్తోంది. ఇక పసిడి మరింత ప్రియం కానుంది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిలు, అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరకు అమాంతం రెక్కలు వచ్చాయి. ఇవాళ ఒకేరోజు ఏకంగా రూ.720 పెరగడంతో... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,730కి చేరుకుని కొత్త రికార్డులు సృష్టిచింది.
ఇక, శనివారం 10 గ్రాముల పసిడి ధర రూ. 41,010 వద్ద ముగియగా... ఇవాళ కొత్త రికార్డులను నెలకొల్పింది. కేవలం రెండు రోజుల వ్యవవధిలోనే 10 గ్రాముల బంగారం ధరపై రూ.1800 పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.