పాతాళానికి పడిపోతున్న బంగారం, వెండి ధరలు...

gold
ప్రీతి చిచ్చిలి| Last Modified శనివారం, 16 మార్చి 2019 (19:51 IST)
ఫిబ్రవరి నెలలో పెరిగిన బంగారం ధరలు మార్చి నెల ప్రారంభం నుండి తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర మునుపటి రెండు రోజుల క్రమంలోనే శుక్రవారం కూడా తగ్గింది. దేశీయ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.260 తగ్గి రూ.33,110కి పడిపోయింది. జ్యూయలర్లు, రిటైలర్ల నుండి డిమాండ్ తగ్గినందున ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదేవిధంగా వెండి ధరలు కూడా తగ్గడంతో కేజీ వెండి ధర రూ.130 తగ్గి, రూ.39,170కి పడిపోయింది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.260 తగ్గి, రూ.33,110కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 తగ్గి రూ.32,940కి పడిపోయింది. ఇక కేజీ వెండి రూ.130 క్షీణించడంతో రూ.39,170కి పడిపోయింది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,090 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,560గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.41,100కి తగ్గింది. మరి మార్చి మొత్తం ఇదే ట్రెండ్ కొనసాగితే పది గ్రాముల బంగారం ధర 30,000లోపు వచ్చే అవకాశం ఉండటంతో మధ్యతరగతి ప్రజల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.దీనిపై మరింత చదవండి :